అత్యంత ప్రతిభావంతులకే హెచ్‌-1బీ వీసా యోగంవాషింగ్టన్‌: హెచ్‌-1బీ వీసా నిబంధనలు మరింత సంక్లిష్టం చేసే పనిలో భాగంగా ట్రంప్‌ సర్కార్‌ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఏడాది హెచ్‌-1బీ వీసాలకు గానూ వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఈ వీసాలు జారీ చేస్తామని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. స్థానికులకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
దీనిపై హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టెన్‌ నీల్సన్‌ మాట్లాడుతూ..‘ప్రతి ఏడాదీ హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత ప్రతిభావంతులను మాత్రమే తీసుకుంటే కంపెనీలకు మేలు జరుగుతుంది. పనిలో నాణ్యత పెరుగుతుంది. అంతేకాకుండా అమెరికా పౌరులకు సైతం ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కలుగుతుంది. స్థానిక నియామకాలు మరింత పెంచాలనే ఉద్దేశంతోనే ఈనిర్ణయం తీసుకున్నాం.’ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.