ఫిబ్రవరి 1 న “సకలకళావల్లభుడు”విడుదల

సుభ్రమణ్యపురం వంటి హిట్ చిత్ర నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి సమర్ఫణలో సింహ ఫిలింస్,దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం సకలకళావల్లభుడు.ఈ చిత్రానికి తనిష్క్ రెడ్డి,మేఘ్లా ముక్తా హీరోహీరోయిన్లు.శివగణేష్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఫిబ్రవరి 1 న “సకలకళావల్లభుడు”విడుదల కానుంది.

      ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ “అవుట్ అండ్ అవుట్ యాక్షన్,కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.ఈ చిత్రానికి హీరో పెర్ఫార్మన్స్,కథ,కధనాలు హైలెట్ గా నిలుస్తాయి.అలాగే ఇంటర్వెల్ సన్నివేశం ఒకంత ఉత్కంఠకు గురి చేస్తుంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ” అన్నారు.

     చిత్ర దర్శకుడు శివ గణేష్ మాట్లాడుతూ “ఒక హిట్ చిత్రానికి కావలసిన ఎలిమెంట్స్ అన్ని ఈ చిత్రానికి కుదిరాయి.ధర్మేంద్ర ఎడిటింగ్ ,అజయ్ పట్నాయక్ సంగీతం,హీరో హీరోయిన్స్,విలన్ పెర్ఫార్మన్స్ తో మా చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుంది.ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ పృథ్వి,జీవాల కామెడీ సన్నివేశాలు.ఇప్పటకే విడుదలైన ట్రైలర్ లో పృథ్వి మేనరిజానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటకే విడుదలైన ఆడియో మాస్ ఆడియన్స్ ని అలరిస్తుంది”.అని అన్నారు.

    తనిష్క్ రెడ్డి,మేఘ్లా ముక్తా,సుమన్,పృథ్వి,జీవా,చిన్నా,అపూర్వ,శృతి,విశ్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి చరణ్,సంగీతం:అజయ్ పట్నాయక్,ఎడిటింగ్: ధర్మేంద్ర,పి ఆర్ ఓ: బి.వీరబాబు,సమర్ఫణ బీరం సుధాకర్ రెడ్డి,నిర్మాతలు: అనిల్,త్రినాధ్,కిషోర్,శ్రీకాంత్ ,కథ స్క్రీన్ ప్లే ,మాటలు దర్శకత్వం: శివ గణేష్

Leave a Reply

Your email address will not be published.