భార్య దేవోభవ 10 మంది హీరోయిన్లతోనా…?

శ్రీనివాసరెడ్డి సినిమాల టైటిళ్లు విచిత్రంగా, ఫన్నీగా ఉంటాయి. అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, బొమ్మన బ్రదర్స్ – చందనా సిస్టర్స్.. ఇలా టైటిళ్లతోనే ఫన్ పుట్టిస్తారు. మొన్నే రాగల 24 గంటల్లో తీశారు. ఇప్పుడు మరో సినిమా కోసం రంగం సిద్ధం చేశారు. దీనికీ విచిత్రమైన టైటిల్ పెట్టారు. అదే.. భార్య దేవో భవ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ.. ఇలాంటివే ఇప్పటి వరకూ విన్నాం. ఇప్పుడు విచిత్రంగా భార్య దేవో భవ వచ్చింది. ఈ సినిమాలో పది మంది హీరోయిన్లు కనిపిస్తారట. టైటిల్ని బట్టే ఇది కామెడీ సినిమా అని అర్థం అవుతోంది. మరి హీరో ఎవరో చూడాలి. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
‘రాగల 24 గంటల’ చిత్రాన్ని రూపొందించిన బ్యానర్లోనే త్వరలో మరో సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా టైటిల్ భార్యదేవోభవ. ఇందులో ప్రముఖ హీరో నటించనున్నారు. పది మంది హీరోయిన్లు ఉంటారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ వలే.. భార్య గొప్పతనం తెలియజేసేలా భార్యదేవోభవ ఉంటుంది. పూర్తి వివరాలను త్వరలో తెలియచేస్తాను’ అని దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు