ఫిబ్రవరి 10వ తేదీ నుంచి సరికొత్త సీరియల్ ‘ప్రేమ ఎంత మధురం’

అనునిత్యం నూతన కథలతో, అద్భుతమైన స్క్రీన్‌ప్లే, ఆకట్టుకునే కథనాలతో రూపొందిన పలు సీరియళ్లు రూపొందిస్తు, ప్రేక్షకులను పరవశంలో ముంచెత్తుతున్న జీ తెలుగు టివి ఛానల్ తాజాగా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ‘ప్రేమ ఎంత మధురం’ అనే సరికొత్త సీరియల్ ని తీసుకువస్తోంది. స్వచ్చమైన ప్రేమకు వయస్సు కూడా అడ్డంకి కాదు. ఇదే కాన్సెప్ట్‌తో రూపొందించిన సీరియల్ ప్రేమ ఎంత మధురం ప్రారంభించబోతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈ సీరియల్లో నటించిన నటీనటులతో పాటు పలువురు సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.
సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందించిన ప్రేమ ఎంత మధురం సీరియల్ కు సంబంధించిన వివరాలను ఎప్పుడు ఆడుతు, పాడుతూ ఉండే చలాకీ పిల్లగా 40 ఏళ్ల డైనమిక్ బిజినెస్‌మ్యాన్ ఆర్యవర్థన్ విభిన్న మనస్తత్వాలు కలిగిన ప్పటికీ ఆతనిని ప్రేమించిన అను పాత్రలో నటించిన వర్ష హెచ్‌కె వివరిస్తూ. ఈ సీరియల్లో అను పాత్ర నా మనసుకి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా, ఈ పాత్ర ద్వారా నన్ను నేను నిరూపించుకునే అవకాశం దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు కూడా నా పాత్ర నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అని అన్నారు. ఆర్యవర్థన్, అను.. ఎలా చిగురించింది, వీరి ప్రేమకు వయస్సు అడ్డంకి కాలేదా, అసలు వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఏంటి? ఇదే కాన్సెప్ట్ తో ప్రేమ ఎంత మధురం సీరియల్ రూపొందిందని, స్వచ్ఛమైన ప్రేమకు డబ్బు, కులం, మతం, ఆస్తులు, అంతస్తులు లాంటి పట్టింపులు ఉండవని చెప్పే సీరియల్ ఇదని చెప్పారు.
ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఆర్యవర్ధన్ పాత్ర పోషించిన వెంకట్ శ్రీరామ్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఆర్యవర్థన్ కేరక్టర్ నేను ఇంతవరకు చేయనిదని, నాకు ఈ పాత్ర చాలా కొత్తగా ఉంది. ఈ కేరక్టర్ ద్వారా ప్రేక్షకులు నన్ను మరోసారి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. స్వచ్చమైన ప్రేమలో ఉన్న ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమని గెలిపించుకోవడానికి ఈ సమాజం అనుమతి తీసుకోవాలా? అనే కథాంశంగా రూపొందిన ప్రేమ ఎంత మధురం ఖచ్చితంగా వీక్షకుల మదిని దోచుకునేలా ఉంటుందని చెప్పారు.
ఫిబ్రవరి 10, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్డీ ఛానెల్స్‌లో ప్రసారం కానుంది. ఈ సీరియల్‌ని అత్యుత్తమమైన ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో రూపొందించడం విశేషం. దీని టైటిల్ సాంగ్‌ని ఆర్ధికంగా, శారీరకంగా ఇబ్బందులు వచ్చినా కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించడం చెప్పుకోదగ్గది. ఇప్పటికీఏ ఈ టైటిల్ సాంగ్ ఇన్స్టంట్ హిట్ కాగా ఈ పాట చాలా మందికి కాలర్ ట్యూన్ కావటం మరో పెద్ద విశేషం.
తొలిసారిగా ఒక సీరియల్ కాలర్ ట్యూన్ ఇప్పుడు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా , బీఎస్ఎన్ఎల్లో అభిమాన ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉందని. త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ ట్యూన్ అందుబాటులోకి రాబోతోందని జి టివి వర్గాలు మీడియాకు చెప్పాయి.
ఇక ఈ సీరియల్‌ని ప్రమోట్ చేసేందుకు ఒక విలక్షణమైన వీడియో కాన్సెప్ట్ తో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రేమ ఎంత మధురం సీరియల్ ఆర్టిస్టుల్ని పరిచయం చేస్తూ, ఓ వీడియో చేసారు. ఇందులో ఈ సీరియల్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు తనదైన స్టైల్లో వివరించారు మహేష్. ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు సూపర్‌స్టార్ మహేశ్‌తో కన్పించగా. ఇప్పుడు ఈ వీడియోలు, సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్లోనూ హల్చల్ చేస్తున్నాయి. హైదరాబాద్ నేపథ్యంలో జరిగే ఈ కథలో రెండు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లో రూపొందిన ఈ ప్రేమ కథాంశం అద్భుతంగా వచ్చిందని యూనిట్ వర్గాలు చెప్పాయి.
ఎలాంటి స్వార్థాన్ని కోరుకోని ప్రేమ.. ఆర్యవర్థన్, అను ప్రేమని గెలిపిస్తుందా.. ప్రేమ ఎంత మధురం.. సీరియల్లో ఎన్నో అద్భుతమైన ట్విస్ట్‌లు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయని ఆర్యవర్థన్, అను తమ ప్రేమని గెలిపించుకుంటారా? తమకొచ్చిన సమస్యల్ని వీరిద్దరూ ఎలా ఫేస్ చేయబోతున్నారన్నది సీరియల్‌ని ప్రతీ రోజూ చూడాల్సిందే నంటున్నారు….