100 మిలియన్ వ్యూస్ దాటేస్తున్న ‘సామజవరగమన’

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠ పురములో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
కాగా ఈ చిత్రంలో తొలుత విడుదలైన ‘సామజవరగమన’ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటకు ఇప్పటివరకు యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. దక్షిణ భారతావనిలో ఒక పాటకు రికార్డ్ స్థాయి వ్యూస్ అందించి నెటిజన్స్ బ్రహ్మరథం పట్టడం ఇదే ప్రధమం. సుప్రసిద్ధ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటకు తమన్ తన అద్భుత ట్యూన్ తో ఓలలాడించారు. కాగా గాయకుడు సిద్ శ్రీరామ్ తనదైన గాత్రమాధుర్యంతో మైమరపిస్తున్నఈ పాట ఇప్పటికీ విశేష ఆదరణకు నోచుకుంటోంది.
మరోవైపు ఈ పాటకు లక్షల్లో టిక్ టాక్ లు సామాజిక మీడియాలో దర్శన మిస్తున్నాయి.ఇవి కూడా ఈ పాటను భారీ హిట్ చేసేందుకు దోహదపడ్డా యని చిత్రయూనిట్ చెపుతోంది. ఈ సినిమాని పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కలసి నిర్మిస్తుండగా, సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.
ఈ మహాప్రస్థానం చిత్రాన్నిఓంకారేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుండగా, కబీర్ దుహాన్ సింగ్, అమిత్, గగన్ విహారి, కంచెరపాలెం రాజు తదితర ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటించనున్నారని చిత్రవర్గాలు చెప్పాయి.