లక్ష షేర్.. కోటి షేర్..100కోట్ల షేర్….. టాలీవుడ్ బాక్సాఫీస్ ఇంతింతై!

వందేళ్ల భారతీయ సినిమా హిస్టరీలో టాలీవుడ్ చరిత్ర పెద్దదే. దాదాపు 85 ఏళ్లు పైగా తెలుగు సినీపరిశ్రమ ఇంతింతై అన్న చందంగా ఎదుగుతూనే ఉంది. ఇప్పటికి మన పరిశ్రమ ఎదిగిన తీరు అసమానం. బాక్సాఫీస్ లెక్కల్ని కొలమానంగా భావిస్తే.. లక్ష షేర్ మొదలు.. కోటి షేర్ క్లబ్, అటుపై 50కోట్ల షేర్ క్లబ్.. 100కోట్ల షేర్.. అంటూ ఇప్పటికి ఒక రేంజును టచ్ చేసింది. బాహుబలి సిరీస్ ఘనవిజయం అనంతరం నాన్ బాహుబలి కేటగిరీ సినిమాలు అద్భుతంగా వసూళ్లు తెస్తున్నాయి. రంగస్థలం, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్లు 100కోట్ల షేర్ వసూలు చేశాయి. ఎంత దూరం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది..అటుపై ఎంత ఎత్తుకైనా ఎదిగేస్తామని నిరూపణ అయ్యింది.

టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రను పరిశీలిస్తే.. తొలిగా 1933లో రిలీజైన ౠసతీ సావిత్రిౠ లక్ష షేర్ అందుకుంది. త్యాగయ్య-25లక్షల షేర్, పాతాళ భైరవి – 50లక్షల షేర్ అందుకున్నాయి. మాయా బజార్ తో తొలిగా కోటి షేర్ దక్కింది. 25 కోట్ల షేర్ అందుకున్న తొలి సినిమా ఇంద్ర. ఇటీవలి సినిమాలు 100 కోట్ల షేర్, 200కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిపోతున్నాయ్. మునుముందు అంతకుమించి రికార్డులు నెలకొల్పే చిత్రాలు టాలీవుడ్ లో రానున్నాయి.

సతీ సావిత్రి మొదలు..
టాలీవుడ్ 85ఏళ్ల చరిత్రలో బాక్సాఫీస్  షేర్ వివరాలు పరిశీలిస్తే.. సతీ సావిత్రి(1933) చిత్రం టాలీవుడ్ లో తొలి లక్ష రూపాయల షేర్స్ అందుకుంది. ఆ తర్వాత త్యాగయ్య (1946) చిత్రం 25 లక్షల లాభాలు అందుకున్న మూవీగా రికార్డులకెక్కింది.

మాయా బజార్ తో కోటి
పాతాళ భైరవి(1951) 50లక్షల షేర్స్ అందుకున్న తొలి చిత్రం, అయితే మాయ బజార్ (1957) కోటి రూపాయల షేర్స్ అందించిన మొట్ట మొదటి తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. లవ కుశ (1963) 1.25కోట్లు వసూలు చేసింది. దసరా బుల్లోడు (1971) 1.5 కోట్ల షేర్, అల్లూరి సీతారామరాజు(1974)- 2 కోట్ల షేర్, అడవి రాముడు (1977)- 3.25 కోట్ల షేర్, ప్రేమాభిషేకం (1981): 4 కోట్ల షేర్, యముడికి మొగుడు(1988)- 5 కోట్ల షేర్, చంటి (1992)- 9 కోట్ల షేర్స్, ఘరానా మొగుడు (1992)- 10 కోట్ల షేర్, పెద రాయుడు (1995)-12 కోట్ల షేర్, సమరసింహారెడ్డి (1999)- 15 కోట్ల షేర్, నువ్వే కావాలి (2000)- 19.5 కోట్ల షేర్, నరసింహ నాయుడు(2001) – 20 కోట్ల లాభం అందించిన చిత్రం..గా నిలిచాయి.

ఇంద్ర నుంచి కొత్త మలుపు
ఇంద్ర(2002) – 25 కోట్ల షేర్స్  తో సంచలనం సృష్టించి టాలీవుడ్ దశ దిశ తిప్పేసింది. మధ్యలో 50 కోట్ల షేర్ సాధించిన సినిమాలెన్నో. ఇటీవల రంగస్థలం (2018)- 120 కోట్ల షేర్ (వరల్ వైడ్), భరత్ అనే నేను (2018) -121 కోట్ల షేర్ (వరల్ వైడ్) వసూలు చేసి సంచలనం సృష్టించాయి.

భవిష్యత్‌పై భారీ అంచనాలు
మునుముందు ఎస్.ఎస్.రాజమౌళి సహా పలువురు దర్శకులు తెరకెక్కిస్తున్న భారీ చిత్రాలు టాలీవుడ్ షేర్ రేంజును నెకట్స్ లెవల్ కి తీసుకెళతాయన్న అంచనాలు ఏర్పడ్డాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్, ప్రభాస్- సుజీత్ – యువి క్రియేషన్స్ సాహో, చిరంజీవి- సురేందర్ రెడ్డి – రామ్ చరణ్ల  సైరా, మహేష్ – మహర్షి వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలకు తెర తీస్తాయో చూడాలి

Leave a Reply

Your email address will not be published.