‘ట్రంప్’ పర్యటన ఖర్చు 100 కోట్లా

ఈనెల 24 నుంచి రెండురోజు పాటు భారత్లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం భారత ప్రభుత్వం అలహా బాద్ వేదికగా ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి ప్రజలకు చెందిన రూ.100 కోట్లు ఖర్చు చేయటంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక భగ్గుమన్నారు.
శనివారం ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ‘ట్రంప్ పర్యటనలో నాగరిక్ అభినందన్ సమితి(డీటీఎన్ఏఎ్స) అనే సంస్థ నిర్వహిస్తుంటే ప్రభుత్వం నుంచి ఖర్చు చేస్తున్న రూ.100 కోట్లు ఏ మంత్రిత్వ శాఖ భరిస్తోందని నిలదీసారు. కమిటీ పేరుతో అసలు విషయాలను ప్రభుత్వం దాచేస్తోంది. ఈ కమిటీకి ఎక్కడ నుంచి డబ్బులు ఇస్తున్నరో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా? అని ప్రియాంక ట్వీట్లో ప్రశ్నించారు.