100 కు ఫోన్ చేస్తే…. పోలీసులు హంగామా

ఓ ఈవెంట్ నిర్వాహకులు మోసం చాటేయడంతో ఓ సిని నిర్మాత కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు అతనిపై దురుసుగా ప్రవర్తించారు. మీకు ఏ సమస్య ఉన్నా 100 కు ఫోన్ చేయమని వారే చెపుతారు తీరా ఫోన్ చేస్తే నానా హంగామా చేస్తున్నారని సినీ నిర్మాత నట్టికుమార్ కుమారుడు పోలీసుల తీరును ప్రశ్నించారు. 

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బేగంపేట్ కంట్రీక్లబ్‌లో ‘బ్యూటిఫుల్’ సినిమాను ప్రమోషన్ చేస్తామని ఈవెంట్ మేనేజర్ సుమన్ చెప్పాడని.. కానీ ప్రమోషన్ చేయలేదని నట్టి కుమార్ తెలిపాడు. ఈవెంట్‌కు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా రావాల్సి ఉందని.. డబ్బు తీసుకున్న ఈవెంట్ నిర్వాహకులు తమను మోసం చేశాడన్నారు. అయితే కంట్రీక్లబ్‌లోకి తమను వెళ్లకుండా సిబ్బందితో అడ్డుకున్నారన్నారు. పార్కింగ్ చేస్తామని  సిబ్బందికి కారు తాళాలు తీసుకుని  ఎంతకు ఇవ్వకపోవడంతో తాళాలు అడిగితే దురుసుగా ప్రవర్తించారు. దీంతో నట్టి కుమార్ కుమారుడు క్రాంతి డయల్ 100కు ఫోన్ చేశాడు.  అక్కడకు చేరుకున్న పోలీసులు డయల్ 100కు ఎందుకు ఫోన్ చేశావని తిడుతూ అతనిపై దాడి చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న నట్టి కుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. తన కుమారుడు క్రాంతిని గొంతు నులిమి మెడపై, ముఖంపై పోలీసులు కొట్టారంటూ గొడవ పడ్డారు. చివరికి పోలీసులు క్షమాపణలు చెప్పారు. దీంతో నట్టికుమార్ శాంతించారు. ఈసందర్భంగా నట్టికుమార్ మాట్లాడుతూ పోలీసుల తీరుతో విసిగి వేసారి పోతున్నామని వారు అమాయకులపై దాడికి పాల్పడుతున్నారన్నారు. 100కు సమస్య ఉంటేనే ఫోన్ చేస్తారని సరదాకు ఎవరూ ఫోన్ చేయరని పోలీసుల తీరును ప్రశ్నించారు. ఈవెంట్ మేనేజర్ సుమన్‌పై కేసు నమోదు చేయాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు.


Leave a Reply

Your email address will not be published.