11న అమెజాన్‌లో ‘ఎఫ్2’ లైవ్

సినిమా రిలీజైన నెలరోజుల్లోనే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు డిజిటల్ మాధ్యమంలో లేటెస్ట్ సినిమాల్ని లైవ్ స్ట్రీమింగ్ కి తెస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే ఇప్పటికే పలు భారీ చిత్రాల్ని డిజిటల్ లో వీక్షించే ఛాన్స్ ప్రేక్షకులకు దక్కింది. ఈ సంక్రాంతి బరిలో సినిమాల్ని ఇప్పటికే డిజిటల్ లో లైవ్‌లోకి తెచ్చేయడం డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద షాక్. తాజా సమాచారం ప్రకారం.. ఈ సంక్రాంతి బరిలో భారీ పోటీనడుమ రిలీజై సంచలన విజయం సాధించిన ‘ఎఫ్ 2: ఫన్ & ఫ్రస్టేషన్’ చిత్రం అమెజాన్ లో లైవ్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈనెల 11న ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఎఫ్ 2 ఇప్పటికే 25 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు 80 కోట్ల మేర షేర్ రాబట్టింది. ఇంకా విజయవంతంగా రన్ అవుతోంది. అయినా మరో ఐదు రోజుల్లో అంటే ఫిబ్రవరి 11న డిజిటల్ లో లైవ్ లోకి వచ్చేస్తోంది. అయితే రిలీజై ఇన్ని రోజులు అయినా ఇప్పటికీ ఎఫ్ 2 చిత్రం చక్కని వసూళ్లు సాధిస్తూ.. ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే అమెజాన్‌లో రిలీజ్ చేసేస్తుండడం పంపిణీదారుల్లో కలవరానికి కారణమవుతోంది. అయితే నెలరోజుల్లో డిజిటల్ రిలీజ్ చేసుకునేలా నిర్మాత దిల్ రాజు అమెజాన్ తో ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారమే ఈ చిత్రం డిజిటల్ లో లైవ్ కి వస్తోంది. అదీ సంగతి.

Leave a Reply

Your email address will not be published.