ముంబై మారణహోమానికి 11 ఏళ్లు: అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..?


సరిగ్గా పదకొండేళ్ల క్రితం 2008 నవంబరు 26న పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలో ప్రవేశించి మారణహోమానికి పాల్పడ్డారు. పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి లష్కరే తొయిబా ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు.

ఆ రోజు భారతీయ చరిత్రలోనే దేశానికి ఒక మాయని గాయం ఏర్పడింది. దాదాపు పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబై నగరంలో  బాంబు దాడులు చేసి జనాలపై విరుచుకుపడ్డారు. మగ, ఆడ, శిశువు, ముసలి, ముతకా అన్న తేడా లేకుండా దొరికిన వారందరినీ కాల్చి చంపారు.  26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు చాలా దారుణమైన రీతిలో హత్యాకాండ జరిగింది. ఈ దాడిలో 173 మంది మరణించగా 308 మంది గాయాల బారిన పడ్డారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఉగ్రవాదులు  దక్షిణ ముంబైలో ఎనిమిది దాడులు చేశారు. ఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్ మరియు టవర్, లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్,  యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్,  మెట్రో సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ బ్యాక్ స్ట్రీట్ మరియు సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి. ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ లో మరియు విలే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి.

ఆనాటి ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఆరుగురు అమెరికా పౌరులు సైతం ఉన్నారు. ఈ ఘటనను యావత్తు ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది. ఈ దాడి జరిగి పదకొండేళ్లు గడిచినా ముంబైవాసులు నాటి విధ్వంసాన్ని తలచుకుని ఇప్పటికీ భయంతో వణికిపోతుంటారు.

Leave a Reply

Your email address will not be published.