118 ట్రైలర్ విడుదల

నందమూరి కళ్యాణ్ రామ్, నివేద థామస్, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా కె వి గుహన్ దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 118. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్, నివేద థామస్, దర్శకుడు కెవి గుహన్ తో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా దర్శకుడు కె వి గుహన్ మాట్లాడుతూ .. ఇప్పటి వరకు తెలుగులో పలు చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన నేను దర్శకుడవ్వాలన్న ఆలోచన కలిగింది. ఈ నేపథ్యంలో ఈ కథను సిద్ధం చేసుకుని కళ్యాణ్ రామ్ కి వినిపించాను. కథ వినగానే అయన బాగుంది మనం సినిమా చేద్దామని చెప్పాడు. ఇక సినిమా మొదలు పెట్టిన దగ్గరనుండి ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రతి ఒక్క టెక్నీషియన్ ఏంతో మంచి సపోర్ట్ అందిస్తున్నారు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు మా పై ఉంటాయన్న నమ్మకం ఉంది. ఇది రొమాంటిక్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాలి .. ట్రైలర్ లోనే కథ ఏమిటన్నది తెలిసిపోతుంది. ఇంత మంచి సపోర్ట్ అందిస్తున్న నిర్మాత మహేష్ , కళ్యాణ్ రామ్, నివేద, షాలిని కి ప్రత్యేక కృతజ్ఞత చెప్పాలి అన్నారు.
హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ .. ఈ కథ విన్నవెంటనే చెయ్యాలని ఉత్సహం కలిగింది. ముక్యంగా దీన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో చేయాలనీ అనుకున్నా .. కానీ నిర్మాతగా కొత్త తరహా ఆలోచనలతో ఉన్న మహేష్ చేస్తే బాగుంటుందనిపించింది. తాను మా ఫ్యామిలీ మెంబర్. సినిమా విషయంలో కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక దర్శకుడు గుహన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కెమెరామెన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలకు ఫోటోగ్రఫి అందించాడు. ఆయన ప్రతి సీన్ అద్భుతంగా చేసాడు. తప్పకుండా ఈ సినిమా మీకు ఓ కొత్త అనుభూతి ఇస్తుంది. ఈ ట్రైలర్ పై జర్నలిస్ట్ మిత్రులు తమ అభిప్రాయాలూ చెప్పాలని  అన్నారు.
నిర్మాత మహేష్ మాట్లాడుతూ .. ఇంత మంచి సినిమా మా బ్యానర్ లో చేయడం అందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ కు, దర్శకుడు గుహన్ కి స్పెషల్ థాంక్స్. సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అన్నారు.
హీరోయిన్ నివేద మాట్లాడుతూ .. ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి సపోర్ట్ అందించిన కళ్యాణ్ రామ్ , డైరెక్టర్ గుహన్ లకు థాంక్స్ . చాలా మంచి సినిమా తప్పకుండా మాకు మంచి సక్సెస్ అందిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు .. ఈ వేదికపై కొందరు సినిమా జర్నలిస్టులు టీజర్ అద్భుతంగా ఉందని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published.