13న జ‌గ‌న్‌, కేసీఆర్‌ల భేటితెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈనెల 13న భేటీ కానున్నారని సమాచారం. హైదరాబాద్‌ వేదికగా సోమవారం భేటీ కానున్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్,  ఏపీ సీఎం జగన్ 8 సార్లు కలుసుకున్నారని సమాచారం. 
 ఏపీలో మూడు రాజధానులపై జరుగుతున్న ప్రస్తుత హాట్ టాపిక్ పై  చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో…కేసీఆర్, జగన్ భేటీలో వచ్చే అంశాలు. ఈ భేటీలో విభజన హామీల అమలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. రాయలసీమలో కాలువల విస్తీర్ణం, సామర్థ్యం పెంపునకు ఆంధ్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రతిపాదనలపై తెలంగాణ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదే విధంగా విభజన చట్టం ప్రకారం ఏపీ భవన్‌ విభజన, రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల మధ్య ఉన్న విద్యుత్‌ బకాయిలు, షెడ్యూల్‌ 9, 10ల్లోని సంస్థలు, కార్పొరేషన్ల విభజన, విద్యుత్‌ ఉద్యోగుల వ్యవహారం, నీటి ప్రాజెక్టులు తదితర అంశాలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిపై సీఎంలిద్దరూ చర్చించే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published.