13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి


అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా రక్షణ కరువైంది. నిన్నగాక మొన్న “దిశ” లైంగిక దాడి దేశం మొత్తం అల్లకల్లోలం సృష్ణిచింది… ఇప్పుడు అమ్మాయిల మీదనే లైంగిక దాడి కాకుండా అబ్బాయిలను సైతం లైంగిక హింసకి గురి చేస్తున్నారు.. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక బాలుడి పై కొంతమంది  హత్యాచారానికి పాల్పడ్డారు. అబ్బాయిపై లైంగిక దాడి ఏంటి అని అనుకుంటున్నారా… నిజమేనండి మీరు విన్నది. ఒక బాలుడిపై లైంగిక‌దాడి చేసారు కొంతమంది అబ్బాయిలు..


వివరాలలోకి వెళితే… నల్గొండ జిల్లా కోదాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోదాడకు చెందిన 13 ఏళ్ల బాలుడిని అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఈనెల 18న క్రికెట్ ఆడుకుందాం రమ్మంటూ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అ బాలుడు నిజంగానే క్రికెట్ ఆడతారేమో అని నమ్మి వాళ్ళ వెంట చెప్పిన చోటుకి వెళ్ళాడు.. ఎవ్వరు లేని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకుని వెళ్లి అక్కడే ఆరుగురు మూకుమ్మడిగా అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అ బాలుడు ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయాడు.. కొన్ని రోజులనుంచి బాలుడి ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.. దీనితో అ బాలుడిని ఎందుకలా ప్రవర్తిస్తున్నావని.. ఆరా తీశారు. దీంతో తనపై ఆరుగురు ఏడునెలలుగా లైంగిక దాడి చేస్తున్నట్లు తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో తల్లి అదే రోజు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఐదుగురు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకు తరలించారు. నవీన్ అనే మరో యువకుడ్ని మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published.