ఫిబ్రవరి 13 న సూరరాయ్ పోత్రు చిత్రం విడుదల….

మాజీ ఆర్మీ కెప్టెన్, ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందిన సూరరాయ్ పోత్రు తమిళ చిత్రం విడుదలకు సిద్దమైంది. నటుడు సూర్య ఈ చిత్రంలో నటించగా సుధ కొంగర దర్శకత్వం వహించారు. 2 డి ఎంటర్టైన్మెంట్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
ఈ సినిమాలో సూర్య నెదుమారన్ రాజంగం పాత్రలో నటించగా బాలీవుడ్ నటుడు పరేష్ రావల్, తెలుగు నటుడు మోహన్ బాబు, కాశీ వెంకట్, అపర్ణ బాలమురళి ముఖ్య పాత్రలలో నటించారు. జివి ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 13 న విడుదల అవుతోంది.
కాగా ఈ సినిమాకు సంబంధించిన పాటలను చెన్నై ఇంటర్నేషనల్ ఎయిపోర్ట్ లో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం, ఇలా విమానాశ్రయంలో ఓ తమిళ చిత్రం ఆడియో లాంచ్ జరగడం ఇదే మొదటిసారి కావటం గమనార్హం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సిఉంది.