ఫిబ్రవరి14న శివ 143

సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా తన కెరీర్ స్టార్ట్ చేసిన డి.ఎస్.రావు హోరా హోరీ సినిమాతో నటుడై వరుసగా సినిమాలో నటిస్తూ బిజీ బిజీ అయిపోయాడు. తాజాగా విలన్ గా నటించిన శివ 143 సినిమా ఫిబ్రవరి14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాను కలసి పలు అంశాలపై ముచ్చటించారు. ఆయనతో ఈ స్పెషల్ ఇంటర్వ్యూ…ఇలా సాగింది,
నిర్మాతగా ఉన్న మీరు హఠాత్తుగా నటుడు ఎలా అయ్యారు…?
అదీ నాకు కూడా ఇప్పటికీ అంతుపట్టని విషయం. నేను ఒకసారి మీటింగ్ సీన్ డిస్కషన్లో ఉండగా మమ్మల్ని దూరం నుంచి గమనిస్తున్న డైరెక్టర్ తేజ వడివడిగా వచ్చి… నువ్వే నా తదుపరి సివిమాలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నావు. అన్నారు. ఇది నాకే ఆశ్చర్యం కలిగించింది. ఏదో సరదాకి ఆటపట్టిస్తున్నారనుకున్నా… . నిజమేనా అని ఆయన్ని పదే పదే అడిగాను, నిజం చేస్తూ, హోరా హోరీ సినిమాలో విలన్ పాత్ర నాతో చేయించారు. అలా మొదటిసారి నన్ను నేను కెమేరా ముందుకు చూసుకుని ఆశ్చర్యపోయా… ఇంకా బాగా చేయాలన్న కసి బాగా పెరిగింది. అలా నటుడిగా నా కెరీర్ స్టార్ట్ అయ్యింది.
మరి నటుడయ్యాక సినీ నిర్మాణం ఆపేసినట్టున్నారే?
అబ్బే లేదండి… సినిమా నిర్మాణం నా వృత్తి, నటన నా ప్రవృత్తి. హోరా హోరీ సినిమా నాకు మంచి పేరే తీసుకువచ్చింది. ఆ సినిమా తరువాత వరుసగా ఇప్పటికి 30 పైగా చిత్రాల్లో నటించాను. మంచి పాత్రలు కూడా వస్తున్నాయి. అయితే ఈ ఏడాదిలో నిర్మాతగా ఒక పెద్ద సినిమా చెయ్యబోతున్నాను.
రి శివ 143 సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.
ఇది కూడా విలన్ గా నాకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందని భావిస్తున్నాను. చిత్ర నిర్మాత రామసత్యనారాయణ గారి ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. నన్ను దృష్టిలో ఉంచుకుని విలన్ పాత్రని బాగా మలచారు డైరెక్టర్ శైలేష్ సాగర్ అందుకు తగిన మంచి కథ రాసుకున్నాడు, సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను అందుకుని విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.
నిర్మాతగా మారటానికి కారణం ఏమిటి?
సినీ ఇండస్ట్రీలోకి డిస్టిబ్యూటర్‌గా రావాలనుకున్నా, అయితే నాకు పరిచయం ఉన్న ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నీ మూడ్‌కి నువ్వు సినిమాలు నిర్మిస్తేనే బెటర్ అన్న సలహా ఇచ్చారు. వారి సహకారంతో నిర్మాతగా మారాను.
నటుడుగా మీ కోరికేంటి?
మంచి సినిమాలు చెయ్యాలనే సంకల్పం నాది. బోయపాటి శ్రీను, పూరి జగన్నాధ్ లాంటి దర్శకులతో పని చేయటం ద్వారా నాలో నటుడిని బాగా ఎస్టాబ్లిష్ చేయచ్చు. . త్వరలో వారి సినిమాల్లో నటిస్తాననే నమ్మకం నాకుంది.
మీ రాబోయే సినిమాలేంటి?
చాలా అవకాశాలు వస్తున్నాయిఅయితే మంచి పాత్రలు కోసం ఎదురు చూస్తున్నాను. భవిషత్తులో నేనేం సినిమాలని చేయబోతున్నానో తెలియజేస్తాను…