అగాపే అకాడమీ బ్యానర్ లో వస్తోన్న ‘నేను కేర్ ఆఫ్ నువ్వు’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల !!!

ఆగాపే అకాడమీ పతాకంపై రతన్ కిషోర్,సన్య సిన్హా,సాగారెడ్డి,సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో అతవుల,శేషిరెడ్డి,పోలీస్ వెంకటరెడ్డి,శరద్ మిశ్రాలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు. బెక్కం వేణు గోపాల్ ఈ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలుపుటకు రావడం జరిగింది.

ఈ సందర్భంగా లిరిక్ రైటర్ ప్రణవం మాట్లాడుతూ….
ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. అన్ని పాటలు సందగర్భానుసారం వస్తాయి. ఈ చిత్రంలో నాకు అగాపే అకాడమీ బ్యానర్ వారు అవకాశం ఇచ్చారుమ్ వారికి ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.

నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ….
ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 1980 లో జరిగిన కథ ఇది. పల్లెటూరు లో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక కథను ఈ సినిమాలో అందంగా చూపించారు దర్శకుడు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ….
సినిమా  ట్రైలర్ చూశాను బాగుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది ఇది. సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతలకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఏ సట్టిఫికెట్ లభించింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది అన్నారు.


Leave a Reply

Your email address will not be published.