ఫిబ్ర‌వరి 14న ‘ఒక చిన్న విరామం’ విడుద‌ల

బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి పునర్నవి ప్రధాన పాత్రలో  మూన్ వాక్ ఎంటర్‌టైన్‌మెంట్ గా రూపొందించిన సినిమా ‘ఒక చిన్న విరామం’. ఇప్ప‌టికే   సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘యు/ఏ’ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఫిబ్ర‌వరి 14న విడుద‌ల కానుంది. సందీప్ చేగూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో. సంజయ్ వర్మ, నవీన్, గరిమా సింగ్‌లు హీరో, హీరోయిన్లుగా నటించారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్‌కు విశేష స్పందన లభించిందని   భరత్ మంచి రాజు సంగీతం సినిమాకు ఎస్స‌ట్‌గా నిలుస్తుంద‌ని నిర్మాత  భారత్ మంచిరాజు  చెపుతున్నారు. ఇప్ప‌టికే ఇరు తెలుగురాష్ట్రాల‌లో మంచి ధియేట‌ర్ల‌ని ఎంపిక చేసి చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నామ‌ని, ప్రేక్ష‌కుల న‌చ్చే అనేక అంశాలు ఇందులో ఉన్నాయ‌ని చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published.