అనుష్క శెట్టి సినీ రంగంలో ప్రవేశించి 15 ఏళ్ళు పూర్తి ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకి కేరాఫ్‌గా మారిపోయింది. మొదట కింగ్ నాగార్జున హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన సూపర్ సినిమాతో నే తన ఆకట్టుకునే అందం, అభినయంతో నటిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్న అనుష్క, అరుంధతి సినిమాలో తనదైన నటనతో అత్యద్భుత విజయాన్ని సొంత చేసుకుంది. దాదాపు చిత్ర సీమలో అగ్రనటుల సరసన హీరోయిన్ గా వరుస అవకాశాలతో అగ్రశ్రేని కథానాయికగా ఎదిగిన అనుష్క రాజమౌళి బాహుబలి రెండు భాగాల్లో తన మార్కు నటనతో ప్రేక్షకులని ఓలలాడించింది.
తాజాగా అనుష్క ‘నిశ్శబ్దం‘ పేరుతో వస్తున్న సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది….!!