ఉల్లి మంటలు కిలో@150

అధిక వర్షాలు-తగ్గిన దిగుబడులు
-కొరవడిన పర్వేక్షణ
కె.రాంనారాయణ
ఖమ్మం
ఉల్లి నిజంగానే కన్నీళ్ళు పెట్టిస్తుంది.ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.కిలో ఉల్లి @150కి పైగాన ఉంది.నిత్యం మన ఆహారంలో భాగమైన ఉల్లి దొరకడమే మహద్బాగ్యంగా ఉంది.పేదలు తమకూరల్లో ఉల్లి వినియోగం మానేశారు.హోటళ్ళలో ఉల్లిదోశ లేదని బోర్డులు పెట్టారు.కూరల్లో  ఉల్లిలేనిదే ముద్దదిగని సగటు మనిషి తల్లడిల్లి పోతున్నాడు.ఉల్లి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే.అందుకే తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందనే సామేతకూడ వచ్చింది.అలాంటి విశిష్టమైన ఉల్లి కొరతతో దేశం తల్లడిల్లుతుంది.ఈయేడాది వచ్చిన అధిక వర్షాల వల్లనే కొరత ఎర్పడిందనేదంట్లో పక్షికసత్యం ఉన్నా పాలకుల ముందుచూపులేని తనమే ప్రధానకారణంగా ఉందనే విమర్శలు ఉన్నాయి.కొన్ని ప్రాంతాలలో నోట్ల రద్దు సందర్బంగా ఎటియంల ముందు దర్శనమిచ్చిన క్యూలైన్ల మాదిరిగా ఉల్లి దూకాణాలముందు ప్రజలు బారులుతీరుతున్నారు.గతంలో 1980,1998,2010ల్లో ఉల్లికొరత ఎర్పడింది.అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై దుమ్మేత్తి పోసింది.అప్పుడు కిలో రూ 100 ధర పలికింది. పార్లమెంట్ లో ఉల్లి దుమారం అట్టుడికింది.ఇప్పుడు ధరలు కొండెక్కటానికి కేంద్రంలో ఉన్న బిజెపి నైతిక బాధ్యత వహించాలి.
ప్రపంచంలోనే ఉల్లి ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా మనం రెండవస్థానంలో ఉన్నాం.దేశరాజధాని ఢిల్లీలో గత సంవత్సరం ఇదేకాలంలో రోజుకి 2నుంచి3వేల టన్నుల ఉల్లి వస్తుండగా ఈయేడాది కేవలం ఢిల్లీ మార్కెట్ కు కేవలం 7నుంచి 8 వందల క్వింటాళ్ళు మాత్రమే రావడం గమనార్హం. ఆసియా ఖండంలోనే ఉల్లి ఉత్పత్తిలో పెద్ద కేంద్రంగా ఉన్న నాసిక్ జిల్లాలోని లాసల్ గామ్ బోసిపోయింది.సమీప భవిష్యత్ లోను ఈ కొరత తీరేలాలేదనే వార్తలు వస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చౌకదుకాణాల ద్వారా కిలో 25కు అందిస్తుండగా తెలంగాణలో సర్కార్ ఆదిశగా చర్యలు చేపట్టకపోవడం దారుణం.

Leave a Reply

Your email address will not be published.