152వ చిత్రంతో బిజీ బిజీగా ఉన్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి – హరీష్ శంకర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంద‌టూ గత అక్టోబర్‌లో ఇండ‌స్ట్రీలో పుంఖ‌నాలు పుంఖ‌నాలుగా వార్తలు వచ్చాయి. అయితే అవి వాస్త‌వ రూపం దాల్చ‌లేదు. తాజాగా  ‘గబ్బర్ సింగ్స తో దర్శకుడిగా స‌క్స‌స్ అందుకున్న హ‌రిష్ శంక‌ర్ త‌న తాజా సినిమా ఎవ‌రుతో చేయాల‌ని మీఆంశ పుడుతున్న ద‌శ‌లో మ‌రోమారు  చిరు- హ‌రీష్ కాంబినేష‌న్  ప్రాజెక్ట్ పై క‌థ‌నాలు విన‌వ‌స్తున్నాయి. 
ప్ర‌స్తుతం చిరంజీవి త‌న 152వ చిత్రంతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌దుప‌రి  త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో  ఒక చిత్రం న‌టించే ఆస్కారం ఉంద‌ని , దీని చిత్ర క‌థ  మలయాళ భాషా నాటకం ‘లూసిఫెర్స’ ప్రేర‌ణ‌గా రూపొందించిన‌ట్టు స‌మాచారం. అటు హ‌రిశంక‌ర్ కూడా   పవన్ కళ్యాణ్ తో  ఓ చిత్రం రూపొందించేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. 
ఒక‌వేళ హరీష్-చిరు చిత్రం షురూ అయిన‌ప్ప‌టికీ క‌థ‌, క‌థ‌నాలు, ఇత‌ర అంశాల‌తో పాటు త‌మ‌కున్న వెసులు బాట్లు చూసుకుంటే ఈ సినిమా వ‌చ్చే ఏడాదికి గానీ షూటింగ్‌కి సిద్దం అయ్యే ఆస్కారం లేద‌న్న‌ది ఫిలింనగ‌ర్ వాసుల మాట‌. చూద్దాం… ఈ సినిమా గురించి ఏర‌క‌మైన ప్ర‌క‌ట‌న రానుందో… 
 

Leave a Reply

Your email address will not be published.