ఫాస్టాగ్ గడువు డిసెంబర్ 15 వరకు పెంపు
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. మొదట డిసెంబర్ 1 నుండి వాహనదారులకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా… తాజాగా ఆ గడువును డిసెంబర్ 15 వరకూ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కేంద్రం ఫాస్టాగ్ కార్డులను ఉచితంగా జారీ చేస్తుంది. ఇక ఫాస్ట్ ట్యాగ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా నిర్ణయించిన రూ.150 కూడా NHAI భరిస్తుంది. దీంతో ఫాస్టాగ్ ట్యాగ్ల జారీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. కాగా జాతీయ రహదారులపై టోల్గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు కేంద్రం ఫాస్ట్ ట్యాగ్స్ అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.