ఈ నెల 18న సాయి తేజ్, మారుతి, రాశిఖన్నా “ప్రతిరోజు పండగే” “ఓ బావ” సాంగ్ రిలీజ్


సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా,  మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా,  గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రంలో ప్రత్యేక సందర్భంలో వచ్చే “ఓ బావ” అనే పాటను ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఈ పాటకు థమన్ అద్భుతమైన ట్యూన్ అందించాడు.  కె కె సాహిత్యం అందించారు. ఈ పాటను
సత్య యమిని, మోహన భోగరాజు, హరితేజ పాడారు.
యష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా నృత్య రీతులు సమకూర్చారు.

ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు… ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే కమేసి ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు.

GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. క‌ట్ట‌ప్ప‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత చేరువైన ప్ర‌ముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ని ఈ సినిమా ద‌ర్శ‌కులు మారుతి ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండ‌నుంది.

Leave a Reply

Your email address will not be published.