కార్తీ 19లో లక్కీ ఛాన్స్

ఛలో, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఒక్కసారిగా యువతరంలో పాపులరైంది రష్మిక మందన. ప్రస్తుతం ఈ భామ కెరీర్ పరంగా సెలక్టివ్గా వెళుతోంది. కార్తీ సరసన ప్రస్తుతం ఓ భారీ చిత్రానికి సంతకం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఖాకీ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ – డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో రష్మిక నాయికగా ఎంపికైంది. కార్తీ 19 వ సినిమా గా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నను ఎంపిక చేశామని .. సదరు సంస్థ ప్రకటించింది. డ్రీమ్ వారియర్స్ బ్యానర్ లో  ప్రస్తుతం సూర్య తో ఎన్ జీ కె చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రెమో ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి రెండవ వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. కార్తీ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి నిర్మాతలు – ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు, దర్శకత్వం – భాగ్యరాజ్ కన్నన్.

Leave a Reply

Your email address will not be published.