దళిత కథలు ఆధారం గా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదలై ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ను శనివారం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ… ” ఒక మంచి సినిమా ఇది. దళితులు పాత్ర లతో రూపొందిన సినిమా ఇది. దళిత కథలు సినిమా గా రూపొందటం కష్టం. కానీ పలాసలో జరిగిన వాస్తవ ఘటనల పాత్రలను హీరోలుగా చేసి చూపాం. కానీ దళితుల నుండే స్పందన కరువైందన్న ఆందోళన వ్యక్తం చేసారు. నా నలభై ఏళ్ల కెరియర్ లో ఏ సినిమా ఆడినా, అడకపోయినా బాధ పడలేదు..కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం..కానీ ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే. అన్నారు. ఆధారం గా
చిత్ర దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ… సినిమా విశ్లేషకులు అందరూ మంచి రేటింగ్స్ ఇచ్చారు. ఈ విజయం మరిన్ని మంచి సినిమాలు చెయ్యడానికి ధైర్యం ఇచ్చిందని చెప్పారు.
చిత్ర సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె మాట్లాడుతూ… నిర్మాత మంచి ప్రయత్రం, దర్శకుడి ఆలోచన సినిమాను నిలబెట్టాయి. నటీనటులందరూ బాగా చేశారు, నా పాత్ర గురించి అందరూ ప్రశంశిస్తున్నారు ధన్యవాదాలని అన్నారు. ఇండస్ట్రీలోని పెద్దలు ఈ సినిమాకు మరింత మాట సాయం చేస్తే బాగుంటుందని తెలిపారు.
చిత్ర కథానాయిక నక్షత్ర మాట్లాడుతూ… ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి, పలాస సినిమాకు మంచి రివ్యూస్ వస్తున్నాయి. వైజాగ్ నుండి ఫ్రెండ్స్ కాల్స్ చేసి మెచ్చుకున్నారని తెలిపారు.
హీరో రక్షిత్ మాట్లాడుతూ… పలాస సినిమా ఇంత పెద్ద హిట్ కుకారణమైన అందరికి ధన్యవాదాలు. సినిమాలో ప్రతి సీన్ అందరూ మాట్లాడుకునేలా ఉండటం ఆనందంగా ఉంది.