రామోజీ సిటీ చేర‌నున్న “కె.జి.ఎఫ్ చాప్టర్ 2

 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో స్టార్ హీరో యశ్ కథానాయకుడు గా “కె.జి.ఎఫ్ చాప్టర్ 2” మూవీ శరవేగంగా రూపొందుతోంది. గ‌తంలో వ‌చ్చిన  పీరియాడిక్ యాక్షన్ కన్నడ మూవీ “కె.జి.ఎఫ్ చాప్టర్ 1” కు సీక్వెల్‌గా నిర్మిస్తున్న ఈ సినిమాలో  బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్న విష‌యం తెలిసందే. ప్రస్తుతం మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కి సంబంధించిన‌ ఆఖరి షూటింగ్ షెడ్యూల్ ను   హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ఆరంభించాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించారు.   రామోజీ ఫిల్మ్ సిటీ ప్రారంభమయ్యే షూటింగ్ లో హీరో, హీరోయిన్స్ తో పాటు చిత్రంలోని ముఖ్య పాత్రధారులు అంతా పాల్గొంటారని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న “కె.జి.ఎఫ్ చాప్టర్ 2” మూవీ కన్నడ భాషతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో విడుద‌ల కానుంది.  “కె.జి.ఎఫ్ చాప్టర్ 1”  సంగీతం అందించిన రవి బస్రూర్ నే ఈ చిత్రానికి కూడా సంగీత ద‌ర్శ‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published.