ఎసియన్ ముక్తా సినిమాస్ ఎ2 ప్రారంభం!!


హైదరాబాద్ లో నారపల్లి లో రాజకీయ, సినీ ప్రముఖలతో ఎసియన్ ముక్తా సినిమాస్ ఎ2 ప్రారంభం గ్రాండ్ గా జరిగింది. ఈ పదో మల్టీ ప్లెక్స్ ను  మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ప్రారంభించారు.
ఇప్ప‌టికే వేగంగా విస్తరిస్తున్న జంట నగరాలలో ఎసియన్ మల్టీ ప్లెక్స్ లు క‌ట్టిప‌డేస్తున్న నేప‌థ్యంలో  సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో ఉండే విధంగా ఈమల్టీప్లెక్స్ లను అందుబాటులోకి  తీసుకువ‌చ్చామ‌ని, ఎసియన్ గ్రూప్ చెపుతోంది. అనతి కాలంలో పది మల్టీ ప్లెక్స్ లను నిర్మించిన ఈ సంస్ధ‌ని సినీ ప్ర‌ముఖులు అభినందించారు.  
ఈ కార్య క్రమానికి   ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి లతో పాటు నిర్మాతలు లక్షణ్, గోవర్దన్ లు, ఎసియన్ సినిమాస్ అధినేత్ సునీల్ దాస్ నారాంగ్, డిస్ట్రిబ్యూటర్ సదానంద్ గౌడ్, శ్రీధర్ , కాంప్లెక్స్ యజమాని జనార్ధన్ లతో పాటు పలువురు ప్రముఖలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published.