ఎఫ్‌2 50డేస్ సెల‌బ్రేష‌న్ప్‌

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఎఫ్ 2 చిత్రం వరల్డ్ వైడ్ గా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్-లక్ష్మణ్ నిర్మించిన ఎప్ 2 చిత్రం 50 రోజుల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా  చిత్ర యూనిట్ ,థియేటర్ కి 50డేస్ షీల్డ్స్ ఇచ్చి సత్కరించారు. అలాగే డైరెక్షన్ యూనిట్ కి ఐఫోన్స్ ఇచ్చి సత్కరించటం విశేషం..ఈ సందర్భంగా…

దిల్‌రాజు మాట్లాడుతూ – “ఎఫ్ 2 సినిమా 50 రోజుల వేడుక‌ను జ‌రుపుకోవ‌డానికి ముఖ్య కార‌ణం మా ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి. మా హీరోలిద్ద‌రూ బిజీగా ఉండ‌టం, అనీల్ త‌న నెక్ట్స్ మూవీకి, అలాగే మేం నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఆల్‌రెడి బిజీగా ఉన్నాం. కాబ‌ట్టి ఈ 50 డేస్ సెలబ్రేష‌న్స్ చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నాం“ అన్నారు.

న‌ట‌కిరిటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ – “అనీల్ ఈ క‌థ చెప్పిన ద‌గ్గ‌ర నుండి ఈ పండుగ సినిమా మ‌న‌దే అవుతుందనుకున్నాం. దిల్‌రాజు, శిరీష‌, ల‌క్ష్మ‌ణ్ స‌హా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంద‌రూ సినిమాపై న‌మ్మ‌కం ఉన్నాం. న‌వ్వును న‌వ్వుకున్న వాళ్లు ఎవ్వ‌రూ న‌వ్వుల‌పాలు కాలేదు. డైరెక్ట‌ర్ అనీల్ న‌న్ను డాడీ అని ప్రేమ‌గా పిలుచుకుంటూ ఉంటాడు. త‌ను న‌వ్వును న‌మ్మి గొప్ప‌గా చెబుతున్నాడు. ఈ క్రెడిట్ అంతా న‌వ్వుకే ద‌క్కుతుంది. అనీల్ సూర్యుడిలా గొప్ప‌వాడు కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

మెహ‌రీన్ మాట్లాడుతూ – “ఈ సినిమాకు సెల‌బ్రేష‌న్స్ తొలి రోజు షూటింగ్ రోజునే మొద‌లైంది. నా 10వ సినిమాకు బెస్ట్ మూవీగా నిల‌వ‌డం, సినిమా ఇంత పెద్ద స‌క్సెస్ కావ‌డం ప‌ట్ల హ్య‌పీగా ఉన్నాను.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు మాట్లాడుతూ – “డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి, థియేట‌ర్స్‌కి ఇలా షీల్డ్స్ ఇవ్వ‌డం చూసి చాలా ఏళ్ల‌య్యింది. మేం సినిమాలు చేసేట‌ప్పుడు మాకిదే పెద్ద పండుగ‌లా అనిపించేంది. మంచి సినిమాకు మంచి నిర్మాత అవ‌స‌రం. ఈ సినిమాకు అలా దిల్‌రాజు స‌పోర్ట్ చేశారు. త‌ను మంచి నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్. ఎంత మంచి సినిమా చేసినా దిల్‌రాజు చేతిలో పడితేనే పెద్ద స‌క్సెస్ అవుతుంది. ఇక అనీల్ రావిపూడి సినిమా చూస్తే చాలు జిమ్‌కు కూడా వెళ్ల‌న‌క్క‌ర్లేదు. చిన్న సినిమాల‌ను నేను ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తాను. నేను తీసిన సినిమాల్లో పెళ్ళిసంద‌డి, గంగోత్రి సినిమాలు ఎక్కువ లాభాల‌ను తెచ్చిపెట్టాయి. వెంక‌టేష్ గ‌త సినిమాల కంటే వంద రెట్లు ఎక్కువ‌గా నవ్వించాడు, అలాగే వ‌రుణ్ కూడా మంచి న‌ట‌న‌ను క‌న‌ప‌రిచాడు“ అన్నారు.

ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ – “అనీల్ రావిపూడి ఎక్క‌డా గ్యాప్ లేకుండా కామెడీతో ఇర‌గొట్టేశాడు. ఎక్క‌డ టాలెంట్ ఉంటే దాన్ని వెతికి ప‌ట్టుకుని ఎంక‌రేజ్ చేయ‌డం దిల్‌రాజుగారికి వెన్న‌తో పెట్టిన విద్య‌. ఆయ‌న ఎంత స‌క్ర‌మంగా త‌న ప‌నిని చేశాడో ఈ ఎఫ్ 2 సినిమా చూస్తే తెలుస్తుంది. ఓసారి నేను, దిల్‌రాజును జంధ్యాల‌గారి ఫంక్ష‌న్‌లో కలిస్తే సార్ నెక్ట్స్ నేను పెళ్ళాం ఊరెళితే సినిమా ఇన్‌స్పిరేష‌న్‌తో ఓ సినిమా చేస్తున్నాన‌ని నాతో అన్నారు. ఆరోజు నుండి ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ప్ర‌తి డైలాగ్‌, కామెడీ సీన్‌ని అంద‌రూ ఎంజాయ్ చేశారు. మ‌నం ఎంత నవ్విస్తామో సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. న‌వ్విస్తే చాలు.. ప్రేక్ష‌కుడు లాజిక్‌, మేజిక్‌ల గురించి ఆలోచించ‌డు. ఆ కిటుకుని అనీల్ రావిపూడి అద్భుతంగా ప‌ట్టుకున్నాడు. ఇక సినిమా రిలీజ్ అయిన మొద‌టివారం త‌ర్వాత సినిమా నిన్న‌టి ప‌త్రిక‌ల్లా త‌యారైపోతున్నాయి. అలాంటి రోజుల్లో ఎఫ్ 2 చిత్రం 50 రోజుల‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డం 500 రోజుల ఫంక్ష‌న్‌తో స‌మానంగా భావిస్తున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ – “హీరోలిద్ద‌రూ లేరు క‌దా! ఈ ఫంక్ష‌న్‌ని సెల‌బ్రేట్ చేయాలా వద్దా? అని దిల్‌రాజుగారు అనుకుంటుంటే, ఇలాంటి ఫంక్ష‌న్స్‌ని ప్ర‌తిసారి సెల‌బ్రేట్ చేసుకోలేం కాబ‌ట్టి చేయాల్సిందేన‌ని నేను రాజుగారిపై ఒత్తిడి పెట్టాను. ఈ సినిమాకు సంబంధించి ఈ షీల్డుని చూస్తే .. దీనికి సంబంధించిన జ్ఞాప‌కం మైండ్‌లో రీల్‌లా తిరుగుతుంది. అందుక‌నే ఈ ఫంక్ష‌న్ చేశాను. ఈ సినిమా వ‌ల్ల సంతోషంగా ఉన్న డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ అంద‌రూ తమ సంతోషాన్ని పంచుకోవ‌డానికి ఇక్క‌డికి రావ‌డం ఆనందంగా ఉంది. 107 కేంద్రాల్లో 50 డేస్ పూర్తి చేసుకోవ‌డ‌మే కాదు.. 130 కోట్ల రూపాయ‌ల రెవెన్యూ జ‌న‌రేట్ చేసిన సినిమా ఇది. నేను చేసిన నాలుగు సినిమాల్లో ఆడుతూ పాడుతూ, న‌వ్వుకుంటూ చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో న‌వ్వు అంటే మ‌రింత గౌర‌వం పెరిగింది. నా సినిమాల్లో హాస్యానికి పెద్ద పీట ఉంటుంది. అందుక‌నే నా సినిమాల‌ను వ‌దులుకోను. నేను నా సినిమాల్లో ఇంత న‌వ్వును పెట్ట‌డానికి కార‌ణం నాకు గురువుల్లాంటి జంధ్యాల‌గారు, ఈవీవీగారు, ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారి సినిమాలు చూసి, ఇన్‌స్పైర్ అయ్యి, నా సినిమాల్లో కామెడీ ఉండేలా చూసుకుంటున్నాను. వాళ్ల సినిమాల‌కు నేను ప‌నిచేయ‌క‌పోయినా, వాళ్ల సినిమాలే నాకు లైబ్ర‌రీ. వాళ్లు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఎఫ్ 2 సినిమాను వెంక‌టేష్‌గారు, వ‌రుణ్ లేకుండా ఊహించ‌లేను. 14 ఏళ్ల క్రితం వెంక‌టేష్‌గారు నువ్వునాకు న‌చ్చావ్ అని పూర్తిస్థాయి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా చేశారు. అలాంటి ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్ సినిమాను వెంక‌టేష్‌గారు చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మ‌న‌కు మ‌రోసారి తెలిసింది. అలాగే వ‌రుణ్‌తేజ్‌, కొత్త కొత్త జోన‌ర్స్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. త‌ను కామెడీజోన‌ర్‌లో చేసిన తొలి సినిమా ఇది. వెంక‌టేష్‌గారు కామెడీ పండించ‌డంలో వేరే రేంజ్ హీరో.. ఆయ‌న ముందు ఎక్క‌డా బ్యాలెన్స్ త‌ప్ప‌కుండా వ‌రుణ్ కామెడీ చేశాడు. అలాగే త‌మ‌న్నా, మెహరీన్‌ల‌కు థాంక్స్. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, అన‌సూయ‌గారు.. ఇలా ప్ర‌తి ఆర్టిస్ట్ నాకు స‌పోర్ట్ ఇచ్చారు. అలాగే సాంకేతిక నిపుణ‌ల‌కు థాంక్స్‌. దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, ల‌క్ష్మ‌ణ్‌గారు నాకు కుటుంబ స‌భ్యుల‌తో స‌మానం. నా జ‌ర్నీలో నా త‌ల్లిదండ్రులు, వైఫ్ కంటే వాళ్ల‌తోనే ఎక్కువ‌గా జర్నీ చేస్తున్నాను. నాకు ఏ క‌ష్టం రానీయ‌కుండా బాగా చూసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published.