ఏప్రిల్ 2 న అనుష్క నిశ్శబ్దం

అనుష్క నిశ్శబ్దం చిత్రం పూర్తయ్యి చాలా రోజులైంది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో విడుదల కావాల్సిన ఈ సినిమా పదే పదే వాయిదాలు పడుతోంది.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు కోనా ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించిన ఈ నిశ్శబ్దం చిత్రాన్ని మొదట జనవరి 31 విడుదలగా ప్రకటించారు. అయితే సాంకేతిక సమస్యలంటూ ఫిబ్రవరి 20 కి వాయిదా వేసారు. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్ .
ఈ చిత్రంలో అనుష్క జంటగా మాధవన్ నటించారు. అనుష్క చెవిటి మరియు మూగ అమ్మాయిగా కనిపిస్తుండగా, మాధవన్ సంగీతకారుడిగా నటించారు. ఈ చిత్రంలో అంజలి, శాలిని పాండే , హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్ ఇలా భారీ తారాగణమే ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అన్నిదశలూ దాటి నిర్మాణం పూర్తయ్యింది. అనుష్క నటించిన భాగమతి చిత్రం విడుదలై రెండేళ్ళ వుతోంది. ఈ నేపథ్యంలో నిశ్శబ్ధంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.