ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు.రాజధాని తరలింపు పై  హైపవర్ కమిటీ నివేదిక తదితర అంశాలపై చర్చించేందుకు వీలుగా ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది మూడు రోజులు నిర్వహించే ఈ సమావేశాల్లో ఏపీ సిఆర్డిఏ చట్టం అధికార వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి చట్టానికి సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టనుంది అసెంబ్లీలో వైకాపా సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ బిల్లులు ఆమోదం పొందుతాయి కానీ, శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సంఖ్య బలం ఎక్కువగా ఉండటం వల్ల  కీలకమైన ఈ రెండు బిల్లులు తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజధాని తరలింపు ను వ్యతిరేకిస్తూ నాలుగు వారాలుగా రాజధాని ప్రాంత రైతులు టిడిపి నేతలు కలిసి ఆందోళన చేయడం తెలిసిందే, ఈ నేపథ్యంలో శాసనమండలిలో ఈ రెండు బిల్లులు ఆమోదం పొందడం కష్టమే  దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని శాసనమండలిలో ఈ రెండు బిల్లు తిరస్కరణకు గురైతే ఆర్డినెన్స్ ద్వారా వాటిని అమలులోకి తీసుకు వచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  

Leave a Reply

Your email address will not be published.