అందమైన అమ్మాయిల ప్రేమ కథ “రూపం యస్ 20 ప్లస్” నవంబర్ 28 న విడుదల…





         సాయి లోకేష్ ప్రొడక్షన్ పతాకంపై  సాయి తులసి సమర్పణలో చక్రవర్తి , బంగారాజు , అక్షర ,సంతోషిణి హీరో హీరోయిన్లుగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో సి.రామాంజనేయ నిర్మిస్తున్న అందమైన అమ్మాయిల ప్రేమ కథ చిత్రం “రూపం యస్ 20 ప్లస్” ఈ  నవంబర్ 28 న ప్రేక్షకులముందుకు వస్తుంది.
      దర్శకుడు వెల్లంకి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… అందమైన అమ్మాయిలను చూస్తే ప్రతి మగాడికి ప్రేమ కలుగుతుంది, ఎలాగైనా ట్రాప్ లో పడేయాలని చూస్తారు, ఒప్పుకోకపోతే బలవంతంగానైనా కోరిక తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు, ఇలాగే మా చిత్రంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయిని ఎలా పాడు చేసారు, ఆమె వాళ్లనుండి ఏ విధంగా తప్పించుకుంది, మంచి మనిషికి దగ్గరై అతని ప్రేమను ఎలా పొందింది అన్నది ఒక జంట కథగా , ఒక పోలీస్ ఆఫిసర్ అందమైన అమ్మాయి ప్రేమలోపడి పెళ్లిచేసుకొన్నాడు, మాఫియా వలలో చిక్కుకొన్న తన భార్యను ఎలా కాపాడుకొన్నాడన్నది రెండో జంట కథ, ఈ రెండు జంటల కథను అనేక మలుపులు తిప్పుతూ అద్భుతమైన స్కీన్ ప్లై తో రూపొందిన్చాన్నారు .                                                                        నిర్మాత  సి.రామాంజనేయ  మాట్లాడుతూ… ఈ చిత్రంలో నాలుగు ఫైట్లు ,  నాలుగు పాటలు ఉన్నాయని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్ది నవంబర్ 28 న విడుదల చేస్తున్నామన్నారు.                                               

            ఇంకా ఈ చిత్రంలో ఉమామహేశ్వరి , రజనీకాంత్ , అజయ్ , రజని , సరోజని నటిస్తున్న 


ఈ చిత్రానికి కెమెరా : సాగర్ , ఆనంద్ ,
 సంగీతం : మెలోడీ శ్రీనివాస్ , ఆర్ ఆర్ అర్మాన్ , 
పాటలు : వెల్లంకి విజయలక్ష్మి , 
ఫైట్స్ : లంక సాంభశివరావు ,
ఎడిటింగ్ : వెంకటేశ్వర్లు , కథ , మాటలు ,
 నిర్మాత : సి.రామాంజనేయ , 
స్కీన్ ప్లై , దర్శకత్వం : వెల్లంకి దుర్గాప్రసాద్

Leave a Reply

Your email address will not be published.