రామోజీ ఫిలింసిటీలో ….. 20కోట్లతో వంతెన నిర్మాణం

డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో  స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నామని యువి క్రియేషన్స్ బృందం ప్రకటించింది. ఇంకా 6 నెలల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో సుజీత్ అండ్ టీమ్ వేగంగా బ్యాలెన్స్ టాకీ ని వేగంగా చిత్రీకరిస్తోంది. ఇప్పటికే దుబాయ్ , అబుదబీలో భారీ యాక్షన్ సీక్వెన్సులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రభాస్ – నీల్ నితిన్ ముఖేష్ బృందంపై భారీ యాక్షన్ సీన్స్ ని పూర్తి చేశారు. అందుకోసం ఏకంగా 60కోట్లు పైగా యాక్షన్ సీన్స్ కే ఖర్చు చేశారంటూ అప్పట్లో ప్రచారమైంది. 300 కోట్ల బడ్జెట్ లో దాదాపు 40 శాతం ఓన్లీ యాక్షన్ సీన్స్ కే ఖర్చు చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో కళాదర్శకుడు సాబు సిరిల్ నేతృత్వంలో ఓ అసాధారణ ఫీట్ ని ౠసాహోౠ టీమ్ వేస్తోంది. ముంబై ౠబాంద్రా- వర్లీౠ లింక్ బ్రిడ్జిని ఆర్‌ఎఫ్సీలో రీక్రియేట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఏమాత్రం లీక్ కాకుండా కఠినమైన నిబంధనల్ని అమల్లో పెడుతున్నారని తెలుస్తోంది. సుజీత్, యువి బృందం స్ట్రిక్టుగా కెమెరాల్ని లోనికి ఎలో చేయడం లేదట. 

కేవలం ఈ ఒక్క బ్రిడ్జి సెట్ కోసం రూ.20 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు హీరో- విలన్ బృందంపై ఎంతో లావిష్ గా ఈ ఫైట్ సీన్ ని తెరకెక్కించనున్నారట. అందుకోసం ఏకంగా నెలరోజుల సమయం వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. ప్రఖ్యాత హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ సారథ్యంలో ఈ ఫైట్ సీక్వెన్సుని తెరకెక్కించనున్నారన్న మాటా వినిపిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన షెడ్యూల్ ని ఖరారు చేశారట. దుబాయ్ ఫైట్ సీన్ తో పాటు ఈ బ్రిడ్జిపై ఫైట్ సీక్వెన్స్ నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా చిత్రీకరించనున్నారు. వాస్తవానికి ఈ భారీ యాక్షన్ సీన్ ని ముంబైలోని ఒరిజినల్ బ్రిడ్జిపైనే చిత్రీకరించాలని భావించినా అందుకు అనుమతులు కష్టమయ్యాయి. సెక్యూరిటీ సమస్యల వల్ల ఇబ్బంది కలగడంతో అనుకోకుండా ఇప్పుడు సెట్ డిజైన్ పై నే ఆధారపడాల్సి వచ్చిందని తెలుస్తోంది. మార్చి చివరి నాటికి ఈ భారీ షెడ్యూల్ ని పూర్తి చేస్తారు. ట్రాన్స్ ఫార్మర్స్, పెరల్ హార్బర్ వంటి భారీ చిత్రాలకు ఫైట్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన కెన్నీ బేట్స్ ఈసారి ఓ టాలీవుడ్ సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ని కొరియోగ్రాఫ్ చేస్తుండడంతో సాహో పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో అద్భుత చిత్రంగా నిలుస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఓవైపు సినిమా చిత్రీకరణ సాగుతుండగానే ఎడిటింగ్ పనుల్ని పూర్తి చేస్తున్నారట. 

Leave a Reply

Your email address will not be published.