మరో 20 ఏళ్లు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలి : తెలంగాణ ఎమ్మెల్యే

మరో 20 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తన తండ్రి వైఎస్ఆర్ లా జగన్‌కూడా మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉండాలి
నవ్యాంధ్ర జగన్ పాలనలో అన్ని విధాలుగా ప్రగతి సాధించడం ఖాయమని , ఏపిలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న నవరత్నాలు సామాన్యలకు వరాలని అన్నారు. పాలనా సౌలభ్యం కోసం మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయానికి కొంత అడ్డు ఉన్నట్టు అనిపించినా ఎటువంటి అవరోధాలు లేకుండా అమలు అవుతుందని పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అగమ్యగోచరంగా సాగుతోందని రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని, ఎప్పుడే నిర్నయాలు తీసుకుంటారో తెలియదు., అన్నింటినీ అడ్డగోలుగా అతిక్రమించడమే ఆనవాయితీగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.