నితిన్-శాలినితో 2005లో

టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ లో ఒకడిగా ఉన్న హీరో నితిన్ ఇప్పుడు పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమవుతున్నాడు. ‘శ్రీనివాస కల్యాణం’ టైమ్‌లోనే పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పిన నితిన్ కి ఇప్పటికి ముహూర్తం కుదిరినట్టు కనిపిస్తోంది, ఏప్రిల్-16న పెళ్లి చేసుకోబోతున్నాడని టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ టాక్.
దుబాయ్‌లోని ప్యాలస్ వెర్సేస్ హోటల్ ఈ పెళ్లికి వేదిక గా బుక్ చేసారట. నితిన్-శాలినితో 2005లో లవ్‌లో పడ్డారని అయితే లండన్‌లో ఎంబీఏ చేస్తున్నందున తన చదువు పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయాలని శాలిని చెప్పడం వల్ల ఈ ఆలస్యంగా తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో నితిన్ తన ప్రేమాయనం వివరించి పెద్దలని ఒప్పించి, ఓకే చేయించుకున్నాడట. దుబాయ్‌లో అత్యంత సన్నిహితుల మధ్యే పెళ్లి చేసకొని.. హైదరాబాద్‌లో మాత్రం గ్రాండ్‌గా రిసెప్షన్ పెట్టుకోవాలని నితిన్ సూచనను ఇరు కుటుంబాలు అంగీకరించాయట.
అయితే తెలంగాణ సూపర్‌స్టార్‌గా నితిన్‌ని భావించేవాళ్లు మాత్రం ఇక్కడే పెళ్లి జరిగితే బాగుంటుందని సూచనలు చేస్తున్నారట. నితిన్ తండ్రి కూడా ఇదే ఆలోచనలతో ఉన్నారని తెలుస్తోంది. దుబాయ్‌లో ఖర్చుతో హైదరాబాద్‌లో వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా పెళ్లి చేయవచ్చన్నది నితిన్ సన్నిహిత వర్గాలు కూడా చెపుతున్నాాా, నితిన్ కూడా అదే తీరుగా ఆలోచించినా, కొందరు మిత్రుల సూచనల మేరకే దుబాయ్ వేదికని ఎంచుకున్నాడని తెలుస్తోంది. మరి నితిన్ ఎలా స్పందిచనున్నాడో చూడాలి.