2019 వెండితెర బూతు సినిమాల హ‌వా మాములుగా లేదుగా…?

2019 సంవ‌త్స‌రం సినిమా వాళ్ళ‌కి ఒక‌ర‌కంగా పండ‌గ‌నే చెప్పాలి. దాదాపుగా వ‌చ్చిన సినిమాలన్నీ కూడా హిట్ట్ బాటే ప‌ట్టాయి. అందులో 183  స్ట్రయిట్ సినిమాలు రాగా, 72 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో అన్ని రకాల జానర్స్ ఉన్నాయి. అయితే ఈసారి అడల్ట్ సినిమాల తాకిడి కాస్త పెరిగింద‌నే చెప్పాలి.  సెన్సార్ నిబంధనలు అనధికారికంగా కాస్త సడలించడంతో, ఈ తరహా సినిమాలు తీయడానికి ఎవ్వరూ వెనకాడ్డం లేదు. అలా 2019లో అటుఇటుగా ఓ పాతిక సినిమాలు వ‌ర‌కు వ‌చ్చాయి. వాటిలో  ఒక ప‌ది సినిమాలు మాత్రం టాప్ ప్లేస్‌లో నిల‌బ‌డ్డాయి అవేంటో చూద్దాం.


మొద‌టి స్థానంలో ఏడు చేపల కథ సినిమానే నిలిచింది.  అభిషేక్ రెడ్డి కాస్తా టెంప్ట్ రవిగా మారిపోయాడు. ఇతడ్ని ఇప్పుడు టెంప్ట్ రవి అంటేనే ఎక్కువమంది గుర్తుపడతారు. అంతలా ఈ సినిమా పాపులర్ అయింది. దీనికి సెన్సార్ రాకపోతే చాలా కష్టపడి సెన్సార్ తెచ్చుకొని మరీ రిలీజ్ చేశారు. సి-సెంటర్లలో ఈ సినిమా మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ అనిపించుకుంది. కాక‌పోతే ట్రైయిల‌ర్‌లో చూపించినంత వ‌ల్గారిటీ సినిమాలో క‌నిపించ‌దు. ట్రైల‌ర్ చూసి సినిమాలో ఏదో ఉంట‌ది అని వెళ్ళిన వాళ్ళు అక్క‌డ పెద్ద‌గా ఏమీ లేక‌పోయేస‌రికి అస‌హ‌నం ఫీల‌వ‌యిన ప్రేక్ష‌కులు కొంద‌రు టెంప్ట్ ర‌విని తిట్ట‌డం కూడా జ‌రిగింది.

ఇక టాప్-10 అడల్ట్ మూవీ లిస్ట్ లో రెండో స్థానంలో నిలుస్తుంది చీకటిగదిలో చితక్కొట్టుడు. ఈ సినిమా కూడా ట్రయిలర్ తోనే పిచ్చెక్కించింది. ట్రయిలర్ తో పోలిస్తే, సినిమాలో కంటెంట్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. కొన్ని రసిక హృదయాలు మాత్రం ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేశాయి. ఆ మేరకు పైసా వసూల్ అనిపించుకుంది ఈ సినిమా.

ఇక లిస్ట్ లో మూడో స్థానంలో పాయల్ రాజ్ పుత్ నటించిన ఆర్డీఎక్స్ లవ్ నిలిచింది. కేవలం పాయల్ అందాలు, ఆ లిప్ కిస్సులు చూసేందుకే ఈ సినిమా కోసం కుర్రాళ్లు ఎగబడ్డారు. ఆ మేరకు వాళ్లను పాయల్ సంతృప్తిపరిచిందనే చెప్పాలి. కేవలం ఈ అడల్ట్ కంటెంట్ కారణంగానే ఈ మూవీకి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. వీటితో పాటు రాయలసీమ లవ్ స్టోరీ, అగ్లీ, నేను లేను లాంటి సినిమాలు కూడా అడల్ట్ కంటెంట్ తో వచ్చి, కొందర్ని బాగానే కట్టిపడేశాయి

2019 టాప్-10 అడల్ట్ మూవీస్
1. ఏడు చేపల కథ
2. చీకటి గదిలో చితక్కొట్టుడు
3. ఆర్డీఎక్స్ లవ్
4. రాయలసీమ లవ్ స్టోరీ
5. అగ్లీ
6. రొమాంటిక్ క్రిమినల్స్
7. నేను లేను
8. 4 లెటర్స్
9. కొత్తగా మా ప్రయాణం
10. మాగ్నెట్

Leave a Reply

Your email address will not be published.