గ్రామీ అవార్డ్స్‌ 2019లో రెహ‌మాన్ ఫ్యామిలీ == రెహ‌మాన్ వార‌సుల్ని చూశారా?

ఆస్కార్ గ్ర‌హీత.. స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్.రెహ‌మాన్ ఈ ఏడాది 61వ గ్రామీ ఉత్స‌వాల్లో అత‌డు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. సోమ‌వారం సాయంత్రం లాస్ ఏంజెల్స్ (కాలిఫోర్నియా) స్టాపుల్స్ సెంట‌ర్ లో జ‌రిగిన‌ ఈ ఉత్స‌వంలో ఏ.ఆర్.రెహ‌మాన్ తో పాటు ఆయ‌న కుమార్తె ర‌హీమా రెహ‌మాన్, ఇత‌ర కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. వెన్యూ నుంచి రెహ‌మాన్ కొన్ని లైవ్‌ ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు షేర్ చేశారు. ఈ ఫోటోల్లో రెహ‌మాన్ కుమార్తె స‌హా త‌న‌తో పాటే ఉన్న ఇత‌ర సెల‌బ్రిటీలు క‌నిపించారు. ఈసారి గ్రామీల్లో ప్ర‌ఖ్యాత పాప్ గాయ‌నీ గాయ‌కులు మిలీ సైర‌స్, లేడీ గాగ‌, కార్డీ బీ, డ్రేక్ వంటి ప్ర‌ముఖులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఏ.ఆర్.రెహ‌మాన్, ఆయ‌న కుమార్తె రహీమా రెహ‌మాన్ గ‌త కొంత‌కాలంగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. రెహ‌మాన్, ర‌హీమాల‌పై ఇటీవ‌లే నెటిజ‌నులు ట్రోల్స్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ మూవీ `స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్` 10 సంవ‌త్స‌రాల వేడుక‌లో పాల్గొన్న‌ ర‌హీమా బుర్కా ధ‌రించి క‌నిపించ‌డంతో ఆ ఫోటోపై నెటిజ‌నులు సామాజిక మాధ్య‌మాల్లో తీవ్రంగా కామెంట్లు చేశారు. దానికి ప్ర‌తిగా ఏ.ఆర్.రెహ‌మాన్ ఆ ట్రోల్స్ కి త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. `ఫ్రీడ‌మ్ టు ఛూజ్‌` అన్న ఒకే ఒక్క రిప్ల‌య్ తో మ‌న‌సు దోచారు. ఇక సామాజిక మాధ్య‌మాల్లో ర‌హీమా రెహ‌మాన్ ఎంతో హుందాగా ఆన్స‌ర్ ఇవ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది. గ్రామీ ఉత్స‌వాల్లో పీసీతో పాటు నిక్ జోనాస్ పాల్గొన‌డం హైలైట్‌.

Leave a Reply

Your email address will not be published.