2019 కెరీర్ చాలా స్పెషల్ దిల్‌రాజు

ఎఫ్ 2 తో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో వున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  వెంకటేష్, వరుణ్ తేజ్, అనీల్ రావిపూడి, సీనియర్ ఆర్టిస్టులు ప్రకాష్రాజ్, రాజేంద్రప్రసాద్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 2021లో ఎఫ్3 తీస్తామన్నారు. సేమ్ టీమ్ కాకపోతే మరో ఒక హీరో యాడ్ అవ్వచ్చని అన్నారు.  ఒక సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజులో సక్సెస్ అవుతుందని ఎవ్వరు చెప్పలేరు. అదే విధంగా ఎప్పుడూ 6 సినిమాలు తియ్యాలని అనుకోలేదు. స్క్రిప్టు అలా కుదిరాయి అలా చేశాను అంతే. ఇప్పుడు కూడా నాలుగు నుంచి ఐదు  స్క్రిప్టు వరకు నాకు క్లారిటీ ఉంది. ఆయన బ్యానర్ నుండి రానున్న సినిమాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది మా బ్యానర్ నుండి 4నుండి 5 సినిమాలు విడుదలకానున్నాయి. ఇక మహర్షి విషయానికి వస్తే ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 2నుండి జరుగనుంది. మార్చి లో షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 25న విడుదలచేయనున్నాం. చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది.

ఫిబ్రవరిలో 96 రీమేక్
అలాగే 96 తెలుగు రీమేక్ కూడా పెద్ద బ్లాక్ బ్లాస్టర్ హిట్ అవుతుంది అందులో ఎలాంటి అనుమానాలు లేవు. సమంత, శర్వానంద్ ఈ చిత్రంలో నటించనున్నారు. 15 ఏళ్ళ నుంచి నా చిత్రాల్లో రీమేక్లు లేవు.  మొట్ట మొదటి సారి రీమేక్ చేస్తున్నాను. ఇది  మంచి ఫీల్ కలిగించే చిత్రము.  నేను ముఖ్యంగా కంటెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. కంటెంట్ బావుంటే బాలీవుడ్‌లో కూడా చెయ్యెచ్చు.
తదుపరి సినిమాలు
వచ్చే సంక్రాంతికి ‘పలుకే బంగారమాయెరా’ అనే చిత్రంతో మీ ముందుకు వస్తా అది ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సతీష్ ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 ని కూడా నిర్మించనున్నాం. ఈ సీక్వెల్ లో వెంకటేష్ , వరుణ్ తేజ్ తో పాటు మరో హీరో కూడా జాయిన్ కానున్నాడు. 2021 సంక్రాంతికి ఈచిత్రాన్ని విడుదలచేసేలా ప్లాన్ చేస్తాం అని దిల్ రాజు అన్నారు.

Leave a Reply

Your email address will not be published.