కరోనా వైరస్ పేరు ఇపుడు కోవిడ్-2019(covid-2019)

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. పలు దేశాల్లో విజృంభిస్తూ.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న ఈ కరోనా వైరస్ పేరు మార్చాలని నిర్ణయించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కోవిడ్-2019(covid-2019)ను పేరుగా నిర్ణయింస్తూ అధికారికంగా వెల్లడించింది.
ఈ మేరకు . డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రస్ అదానోమ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కోవిడ్ పూర్తి పేరు c- corona, v- virus, d- disease2019. కరోనా అనే పేరు దానికి చెందిన కొన్ని వైరస్ల సమూహాన్ని సూచిస్తుంది. దీంతో ఈ పేరుపై ప్రపంచ వ్యాప్తంగా రెలకొన్న గందరగో ళాన్ని తొలగించేం దుకు ఈ విషయంపై అనేక పరిశోధనలు చేస్తున్న పరిశోధకులు, శాస్త్రవేత్తల సూచనలతో ఈ అధికారిక పేరును పెట్టామని వివరించారు. కరోనాకు కోవిడ్-19గా పేరు ప్రపంచంలోని అన్ని దేశాలలో అమలులోకి వస్తుందని, వైద్య సంస్థలు తమ రిపోర్టులలో, ఈ వ్యాధికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలలోనూ కోవిడ్-19గా పేర్కొనాలని సూచించారు.