2021 జనవరి 8న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం

సినీ జక్కన రాజమౌళి డైరెక్షన్లోఎన్టీఆర్, చరణ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఇప్పటికే ఈ చిత్రం పై అటు అభిమానులతో పాటు ఇటు ఇండస్ట్రీలో చాలా అంచనాలు న్నాయి. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా 2021 జనవరి 8న విడుదల కానుంది. ఓ వైపు షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్నిథియేట్రికల్ బిజినెస్ అప్పుడే మొదలైపోయింది. ‘బాహుబలి2’ మించి అన్ని ఏరియాల్లో రికార్డు బిజినెస్ ను నమోదు చేస్తోందని ‘ఆర్.ఆర్.ఆర్’ యూనిట్ చెపుతోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం చరణ్, ఎన్టీఆర్ లకు భారీ క్రేజ్ ఉన్న సీడెడ్ ఏరియాలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిందని తెలుస్తోంది. అక్కడ 50 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. రాజమౌళి దర్శకుడు కావడంతో భారీ రేటు పెట్టి డిస్ట్రిబ్యూటర్ ఏరియా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. రిలీజ్ కి ఇంకా 9 నెలలు పైనే సమయం ఉన్నప్పటికీ అద్భుతాలు సృష్టిస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.