2024లో నేనే ముఖ్యమంత్రిని కావచ్చు

తెలంగాణకు కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రిని తానే కావొచ్చంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ అంతటా ఆసక్తికర చర్చకు దారి తీసింది. సోమవారం ఆయన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ…. ‘2024లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఖాయం. నేనే ముఖ్యమంత్రిని కావచ్చు లేదా సాధారణ కార్యకర్త అయినా కావచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యానించారు. అయితే తను సీఎం అభ్యర్థి అంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలోనూ స్థానికంగానూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితమేనని, ఎం అభ్యర్థి ఎవరనేది జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుంది.’ అని ఆశ్చర్యపరిచరటం విశేషం.
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేస్తారంటూ వస్తున్న ఊహాగానాలపైనా స్పందించిన కిషన్ రెడ్డి ఇప్పటి వరకు కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదన లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో అమలు చేస్తున్న అన్ని పథకాలకు కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయని, కానీ కేసీఆర్ దానిని దాచి పెడుతు, అసలు కేంద్ర సాయమే అందటం లేదని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇక షిర్డీ, పత్రి ఆలయాలపై జరుగుతున్న ఆందోళనతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని, పత్రి అంశాన్ని పక్కకు పెడతామని అక్కడి ప్రభుత్వం ప్రకటించినందున వివాదం సమసిపోయినట్టే కదా? అని అన్నారు. అలాగే ప్రపంచమంతా నివ్వెరపోయేలా త్వరలోనే అయోధ్యలో రామాలయం కడతామని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు వివరించారు.