ఫిబ్రవరి 21 న ధియేట‌ర్ల‌కు రానున్న రాహు ….

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం రాహు. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని, ప్రివ్యూల‌కు సిద్ద‌మ‌వుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు సిద్ద‌మ‌వుతున్నారు నిర్మాత‌లు. 
‘‘ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి నే సాగగా.. పాదాలూ దూరాలు మరిచాయి ఒట్టూ మేఘాల్లో ఉన్నట్టుగా.. ఏమో ఏమో ఏమో’’ పాటతో ‘రాహు’లో  సిధ్ శ్రీరామ్ పాడిన పాట తన గాత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయ‌టం ఖాయంగా ఉంది.  ఈ పాట సోష‌ల్ మీడియాలో హాంటింగ్ సాంగ్ అనిపించుకుంటుండ‌టం విశేషం.

చిత్ర విడుద‌ల‌, నిర్మాణాల‌పై  దర్శకుడు సుబ్బు వేదుల  మీడియాలో మాట్లాడుతూ  ‘‘ ప్రేమకథా చిత్రంలా కనిపించే  థ్రిల్లర్ మూవీ ఇది. . ప్రేమకథలోని బలమైన ఎమోషన్స్ తో పాటు  ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేలా కథనం క‌ట్టిప‌డేశాలా ఉంటుంద‌ని అన్నారు.   ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాహుకి పెద్ద అసెట్ గా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో  రూపొందించిన ఈ  చిత్రం తెలుగులో కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తున్న చిత్రాల స‌ర‌స‌న మా రాహు  నిలబడుతుంది అని న‌మ్మ‌కం ఉంది. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నాం… స‌క్స‌స్ అందుకుంటాం అని ధీమాగా చెప్పారాయ‌న‌.

Leave a Reply

Your email address will not be published.