ఈనెల 21న ` ప్రెజర్ కుక్కర్` చిత్రం విడుదల

యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాయి రోనక్, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా సుజోయ్ అండ్ సుశీల్ దర్వకత్వంలో తెరకెక్కిన చిత్రం` ప్రెజర్ కుక్కర్` ఈనెల 21న అభిషేక్ పిక్చర్స్ ద్వారా విడుదలకానుంది. ఈ సంధర్భంగా హీరోయిన్ ప్రీతీ అస్రాని ఇంటర్వ్యూ..
మీ నేపథ్యం గురించి చెప్పండి?
నేను స్వతహాగా గుజరాతీని, మా కజిన్ అంజు ఓ టీవీ ఆర్టిస్ట్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో జర్నలిస్ట్ రోల్ కూడా చేసింది. ఆమె నే స్ఫూర్తి గా తీసుకుని నేను సినిమాల్లో నటించాలని అనుకున్నాను గుజరాత్లో చదువు ముగించుకుని, హైదరాబాద్ వచ్చేసా, తెలిసిన వాళ్లు చెపితే మొదట ‘ఫిదా’ అనే షార్ట్ ఫిలింలో నటించాను. తరువాత మరికొన్ని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న క్రమంలోనే హీరో దగ్గుపాటి రాణాతో కలసి ఓ వెబ్ సిరీస్ చేసే అవకాశం వచ్చింది. దాన్ని చూసిన ‘మళ్ళీ రావా’ సినిమా నిర్మాతలు నాతో ఓ మంచి క్యారెక్టర్ కి అవకాశం ఇచ్చారు. అలాగే పక్కింటి అమ్మాయి అనే ఓ టివి సీరియల్ లో కూడా నటించా, హీరోయిన్ గా ఇది నా మొదటి చిత్రం.
ప్రెజర్ కుక్కర్ అనే టైటిల్ విచిత్రంగా లేదు… మీకేమనిపించింది?
మీరన్నది నిజమే, చిత్ర దర్శకుడు నిర్మాత నాదగ్గరకొచ్చి కథ వినిపించినప్పుడు సినిమా పేరడిగితే ప్రెజర్ కుక్కరని చెప్పారు. .
ఈ టైటిల్ విన్నప్పుడు నాకు గమ్మత్తుగా అనిపించింది. హీరోకి జీవితం పట్ల సరైన అవగాహన ఉండదు. కేవలం తన తండ్రి ఏం చెబితే అది గుడ్డిగా చేస్తుంటాడు. బీటెక్ అయపోయిన హీరో పేరెంట్స్, బంధువులు, స్నేహితుల నుండి అమెరికా వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలనే వత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రెజర్ కుక్కర్ లో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. దీనికి ఈ టైటిల్ సరైనదే అనిపించింది.
ఇంతకీ ఈ చిత్రంలో మీరు హీరోయిన్ కదా? ఎలాంటి రోల్ పోషిస్తున్నారు?
ఈ సినిమాలో నేనో సోషల్ యాక్టీవిస్ట్ ని, ఇండిపెండెంట్ స్ట్రాంగ్ అమ్మాయిగా ఉండే అనిత పాత్ర పోషించా. హీరో కిషోర్ పాత్రకు విరుద్ధంగా అనిత పాత్ర ఉంటుంది.
ప్రెజర్ కుక్కర్ మూవీ యూత్ ఫుల్ అంటున్నారు నిజమేనా…?
మీకా సందేహం ఎందుకు కలిగిందో అర్ధం కాలేదు. సినిమా వాస్తవానికి దగ్గరగా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు మన జీవితంలో ఎక్కడో జరిగినట్టో చూసినట్టే ఉంటాయి. కామెడీ, లవ్, ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలు ప్రెజర్ కుక్కర్ మూవీలో ఉంటాయని చెప్పగలను
తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఎక్కడైనా నేర్చుకున్నారు.
అవును హైదరాబాద్ వచ్చాక నటిగా మారాలనుకున్న తదుపరి నా చుట్టూ వున్నవాళ్లని గమనించే దాన్ని, వారు మాట్లాడుతున్న మాటలకు అర్ధాలేంటో మా కజిన్‌ని అడిగేదాన్ని, అలా అలా కొంత అలవాటైంది. రెండు మూడు టేక్ లు తీసుకున్నప్పటికీ కష్టపడి ఈ సినిమాలో పాత్రకు నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాను . తెలంగాణ స్లాంగ్ నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పాను.
తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ యాక్టర్ తో వర్క్ చేసారు కదా ఎలా ఉంది?
మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువ అయితే ఆయన రాకతో షూటింగ్ గంభీరంగా మారిపోయినా, సరదా డైలాగులోత అందరిలోనూ జోష్ నింపుతుండటం ఆయన ప్రత్యేకత, ఆయన మాట తీరు, ఇచ్చే గౌరవం నాకు బాగా నచ్చింది.. ఈ సినిమాలో ఆయన కామెడీ కూడా బాగా ఆకట్టుకునేలా ఉంది.
మీరు థియేటర్ ఆర్టిస్టని అంతా చెపుతున్నారు నిజమేనా?
కాదండీ.. నేను థియేటర్ ఆర్టిస్ట్ కాదు.! కానీ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని అందరి సినిమాలు బాగా చూసి, వాటి నుంచి చాలా నేర్చుకున్నా… నేను కేవలం అప్‌కమింగ్ ఆర్టిస్ట్‌ని మాత్రమే.
ఈ సినిమా దర్శకులు గురించి చెప్పండి?
ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు.. సుజోయ్ , సుశీల్ గార్లు, ఇద్దరిదీ ఒకటే థాట్. సినిమా కొత్తలో. సీన్ చేసేటప్పుడు ఒక్కరే ఉంటారా.. ఇద్దరూ ఉంటారా అని డౌట్ ఉండేది. కానీ స్పాట్లో ఇద్దరూ ఎవరి పని వారు చేస్తునే… తమకు నచ్చినట్టు షాట్ వచ్చేవరకు వదిలి పెట్టేవాళ్లు కాదు. రెండు మూడు టేక్ లైనా షాట్ కరెక్ట్ గా వచ్చేలా చూసుకునే వారు. అందుకే ఈ సినిమాలో సీన్లు చాలా బాగా వచ్చాయి.
మీ తదుపరి సినిమాలేంటి?
ప్రస్తుతం గోపిచంద్ సిటీమార్ సినిమాలో కబడ్డీ టీం కెప్టెన్ గా కనిపిస్తాను. ఇంకా కథలు విన్నాను. కొన్నింటికి సైన్ చేయాల్సి ఉంది.