ఈనెల 21న విడుదల కానున్న ‘వసంత కాలం’‘5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై ఇంతకుముందు ‘ఏకవీర, వెంటాడు-వేటాడు” వంటి భారీ చిత్రాలు అందించిన యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్  లేడి సూపర్ స్టార్ నయనతార క‌థానాయిక‌గా రూపొందిన త‌మిళ సూప‌ర్‌హిట్‌ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ ను ‘వసంత కాలం’ పేరుతొ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామ‌న్నారు నిర్మాత‌.

ఈ సినిమా కు సంబంధించిన వివ‌రాల‌ను ఆయ‌న మీడియాకు వివ‌రిస్తూ… కి ‘బిల్లా-2’ ఫేమ్ చక్రి తోలేటి దర్సకత్వంలో “టాప్ హీరోలకు తీసిపోని సూపర్ క్రేజ్ కలిగిన నయ‌న‌తార ముఖ్య పాత్ర‌లో  హీరోయిన్ ఓరియంటడ్ చిత్రం ఇద‌ని,  భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారని చెప్పారు.  యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు. 
 

Leave a Reply

Your email address will not be published.