యాక్షన్ థ్రిల్లర్ ’22’ టీజర్ విడుదల

మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజర్ ను ఆదివారం ఉదయం కింగ్ నాగార్జున విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథిగా పాల్గొని `22` మూవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “అందరికి ఎంతో ఇష్టమైన సినీ జర్నలిస్టు బి.ఎ.రాజు దివంగత దర్శకురాలు జయగారి అబ్బాయి శివ. డైరెక్టర్ అవుతున్నాడంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వ్యక్తులలో నేనూ ఒకడిని శివ దర్శకుడిగా జయగారి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సినిమా టీజర్ ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ 22, 2-2-2020. అన్ని రెండులే ఉన్న రోజేనే విడుదల కావటం. న్యూమరాలజి ప్రకారం నా అదృష్టసంఖ్య కూడా రెండు కావటం చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – శివ దర్శకుడు కావటానికి చాలా కష్టపడ్డాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా వద్దకు వచ్చి ఓ సినిమా ప్రొస్ట్ ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేశాడు. ఈ సినిమాతో ఒక మంచి ప్రయత్నం చేశాడు. ఓ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను తీసుకుని ఇంత బాగా తీశాడంటే చాలా హార్డ్ వర్క్ చేశాడనిపిస్తోంది. “ అన్నారు.
హీరో రూపేష్‌కుమార్ చౌదరి మాట్లాడుతూ – ` మా అయి ఈ ప్రొడక్షన్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా క్యాలెండర్ లాంచ్ చేసినందుకు మారుతిగారికి థ్యాంక్స్. నాగార్జునగారిచేతుల మీదుగా మా సినిమా టీజర్ లాంచ్ అవడం ఆనందంగా ఉంది“ అన్నారు.
చిత్ర దర్శకుడు శివకుమార్ బి.మాట్లాడుతూ – కొత్త దర్శకులను ప్రొత్సహించే నాగార్జునగారి చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా కథ ప్రకారమే 22 అనే టైటిల్ పెట్టాం. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్“ అన్నారు.
హీరోయిన్ సలోని మిశ్రా మాట్లాడుతూ – ఈ సినిమాలో నాకు కంఫర్ట్‌జోన్‌కు విభిన్నమైన మంచి పాత్ర ఇచ్చిన శివగారికి థ్యాంక్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. రూపేష్గారు బాగా నటించారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది“ అన్నారు.
ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో యువ హీరో అక్కినేని నాగచైతన్య , నిర్మాత బి.ఎ. రాజు, ప్రముఖ నిర్మాత కొండా కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.