హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌కు 23 యేళ్ళ జైలుశిక్షపలువురు హీరోయిన్లతో పాటు.. సహాయ నటీమణులను లైంగికంగా వేధించినట్టు వచ్చిన ఆరోపణలు నిరూపితం కావడంతో హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌కు 23 యేళ్ళ జైలుశిక్ష పడుతూ న్యూయార్క్ కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ కేసు తీర్పు వివరాలను పరిశీలిస్తే,

నేడు ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపుల ప‌ర్వం కొన‌సాగుతునే ఉంది. బాలీవుడ్‌లో ఆరంభ‌మైన‌ ‘మీటూ’ ఉద్యమం క్ర‌మ‌క్ర‌మంగా విస్తరించి తెలుగునాట‌కు కూడా పాకింది. ఈ క్ర‌మంలో చాలా మంది న‌టీమ‌ణులు ఈ వేధింపుల విష‌య‌మై రోడ్లు ఎక్కారు. తాజాగా  హాలీవుడ్ నిర్మాత  హార్వీ వెయిన్‌స్టీన్ కు లైంగిక వేధింపుల కేసులో ఏకంగా 23 ఏళ్ల శిక్ష విధించ‌డంతో   మీటూ   ఉద్య‌మానికి ఊర‌ట నిచ్చింది.  ఎంత‌టివారైనా శిక్షార్హులే అనేందుకు తాజా కేసు  నాంది పలికినట్ట‌య్యింద‌ని ఫిలింన‌గ‌ర్‌లో టాక్ ఆరంభ‌మైంది.

ఇక ఈ కేసు వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే… హాలీవుడ్ పలు హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్  దాదాపు 90 మందిని శారీరకంగా వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హార్వీ చేత వేదింపులు ఎదుర్కోబడిన వారిలో ఏంజెలినా జోలీ, సల్మా హయక్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఉండ‌టం విశేషం.  సినిమా అవకాశాలను ఎరజూపిన హార్వీ తమను మోసం చేశాడంటూ ఎంతో మంది ఫిర్యాదులు  అంద‌టంతో గత ఏడాది ఫిబ్రవరిలో 12 మంది సభ్యుల జ్యూరీ విచారణ చేపట్టి, అన్నీ వాస్తవాలేనని తేల్చింది.  ఈకేసులో జ్యూరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా న్యూయార్క్ కోర్టు తీర్పిచ్చింది.

  కోర్టులో విచారణ ల సంద‌ర్భంగా ఈ నిర్మాతపై వచ్చిన ఆరోపణలు   నిరూపితమయ్యాయని  న్యాయ‌మూర్తి జేమ్స్ బుర్కే పేర్కొన‌గా ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన హార్వీ, వీల్ చైర్‌లోనే కోర్టుకు హాజరు కావ‌టాన్ని చూపిస్తూ, హార్వీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ల శిక్ష మాత్రమే విధించాలని ఆయన లాయర్లు కోరారు. అయితే ఆయనకు 29 సంవత్సరాల శిక్ష పడాల్సి ఉంద‌ని, కానీ  సమాజానికి ఆయన చేసిన స‌మాజ సేవలను దృష్టిలో ఉంచుకుని కొంత శిక్షను తగ్గించామని న్యాయస్థానం పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

  

Leave a Reply

Your email address will not be published.