ఈ నెల 24న విడుద‌ల‌వుతున్న ‘డిస్కోరాజా’

ఎలాగైనా సక్సెస్ అందుకొని ర‌వితేజ డిస్కోరాజా తో సేఫ్ జోన్ లోకి తిరిగి రావాలని భావిస్తున్నాడు. . వీఐ ఆనంద్ దర్శకత్వంగా పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న విడుద‌ల‌వుతున్న క్రమంలో ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ జ‌రిగింది. 

ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ… ఈ సైన్ ఫిక్చన్ థ్రిల్లర్ మూవీలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రలతో కనిపించనున్నాన‌ని చెప్పారు. తొలిసారి ‘డిస్కోరాజా’ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్య హోప్ ల‌తో షూటింగ్‌ టైంలో ఫుల్‌గా ఎంజాయ్ చేశానని ఎంజామ్‌మెంట్ ఫ్యాన్స్‌కు కూడా ఉంటుందని అన్నారు. పాయల్ రాజ్‌పుత్‌ది ప్రత్యేక పాత్ర అని.. నభా నటేష్ చెప్పాల్సిన అవసరంలేదని, ఇరగదీసిందని , బాబీ సింహా, రాంకీ లాంటి యాక్టర్స్‌తో తొలిసారి కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని అన్నారు
 ఇప్ప‌టివ‌ర‌కు తన 11 సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్ ప‌నిచేసార‌ని, తన నెక్ట్స్ మూవీ ‘క్రాక్’ కూడా ఆయ‌నే ప‌నిచేయ‌నున్న‌ట్టు చెప్పారు.  ఈ చిత్రం చూసాక‌ రానున్న రోజుల్లో డిస్కోరాజా’ మూవీకి ప్రీక్వెల్ లేదా సీక్వెల్ గానీ నిర్మించే ఆస్కారం ఉంద‌ని త‌న‌కు అనిపిస్తోంద‌ని చెప్పారు. 
గ‌తంలో త‌న‌తో సినిమా తీసి ఇబ్బంది ప‌డిన రామ్ తాళ్లూరి మ‌ళ్లీ త‌న‌తోనే చిత్రాన్ని తీసేందుకు ర‌డీ అవ్వ‌టం ఆనందాన్నిస్తోంద‌ని, ‘డిస్కోరాజా’ ఖ‌చ్చితంగా విజ‌య‌వంతం అవుతుంద‌న్న ధీమా త‌న‌కుంద‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.