ఈ నెల 24న జగనన్న ‘వసతి దీవెన’ ప్రారంభం

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకరంగా జగనన్న వసతి దీవెన’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24న విజయనగం జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. గురువారం ఆయన విజయనగరంలోని తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ.. సీఎం జగన్ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలోని నాయకులంతా ఈ కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న దిశా పోలీస్ స్టేషన్ను సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
జిల్లాలో పలు పరిశ్రమల మూసి వేతకు కారణమైన తెలుగుదేశం నేతలు ఇప్పుడు ప్రజా చైతన్య యాత్రలంటూ మభ్యపెట్టే పనిలో ఉన్నారని, స్థానిక ఎన్నికలలో ఓట్ల కోసమే ఈ ఫీట్లు అని ఎద్దేవా చేసారు. కేంద్ర,రాష్ట్ర మంత్రిగా పని చేసిన అశోక్ గజపతిరాజు జిల్లాకు ఎన్ని పరిశ్రమని తీసుకోచ్చారని, ఏవరిని మభ్య పెట్టడానికి టీడీపీ నేతలు యాత్రలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జిల్లాలోని పరిశ్రమలను ఏ విదంగా కాపాడుకోవాలో.. యువతకు ఉపాది ఉద్యోగాలు ఎలా కల్పించాలో తమ ప్రభుత్వానికి తెలుసని, వారి నుంచి తాము నేర్చుకోవాల్సిన పనే లేదని వ్యాఖ్యానించారు బొత్స.