24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు నిర్మిస్తున్న ‘మోసగాళ్ళు’

మంచు విష్ణు.. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో ఎవీఎ ఎంటర్టైన్మెంట్.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు జెఫ్రీ చిన్. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ‘మోసగాళ్ళు’ టీమ్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ సినిమాలో ‘అను’ పాత్ర కాజల్ పోషిస్తోంది,.. స్లీవ్ లెస్ బ్లేజర్ ధరించి.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్.. చేతికి వాచ్ తో ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ తరహాలో ఉన్న కాజల్ ఆకట్టుకునేలా ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద ఐటీ స్కామ్ కు సంబంధించిన కథతో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ ఆ స్కామ్ లో ఏం చేసిందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇటీవలే అమెరికాలో ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుని వచ్చిన ‘మోసగాళ్ళు’ టీమ్ , త్వరలో హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఈ ఏడాది వేసవిలోఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు మంచు విష్ణు.