మార్చి 25న ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’.

బుల్లితెరపై తనమార్కు సందడితో ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు తొలిసారి హీరోగా నటించిన చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ జరుగుతోంది. ‘ఆర్య 2, నేనొక్కడినే” లాంటి సూపర్ హిట్ సినిమాలలకు
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి సహాయకుడిగా పనిచేసిన ఆయన శిష్యుడు మున్నా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ బాబు నిర్మించిన ఈ. చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది.
ఫుల్లెన్త్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమాని మేకర్స్. జీఏ2, యూవీ క్రియేషన్స్ సంస్థలు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన చిత్ర పాటలలో ఇప్పటికే విడుదలైన ‘నీలి నీలి ఆకాశం.. సామాజిక మీడియాలో వైరల్గా మారి, కాలర్ ట్యూన్ అయి కూర్చోగా, తాజాగా విడుదల చేసిన ‘మీకో దండం..’ పాట కూడా మైమరిపిస్తోంది.