ఓటర్ల నమోదు 25 వరకు అవకాశం -ఎన్నికల ప్రధానాధికారి రజత్‌

హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తలెత్తిన ఓట్ల గల్లంతు సమస్య మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఓట్ల నమోదు కోసం కొత్తగా 8లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌ వెల్లడించారు.బుధవారం సాయంత్రం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లా డుతూ ఏటా జనవరి 1వ తేదీతో కొత్త ఓటర్ల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఓట్ల తొలగింపు కోసం 10వేల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. జనవరి 25 వరకు ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.

ఫిబ్రవరి 22న తుది ఓటరు జాబితా ప్రకటిస్తామన్నారు. తుది జాబితా ముద్రణ తర్వాత డబుల్‌ ఓట్లు కూడా తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా విషయంలో ఎక్కువ ఆరోపణలు వచ్చాయని అలాంటి పొరపాట్లు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రజత్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికలకు ముందు ఓటరు జాబితాలో పేరు సరిచూసుకోవడం పౌరుల బాధ్యత అని అన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల విషయంలో అనేక సమస్యలు వచ్చాయని,ఇప్పుడు ఓటర్ల నమోదు చాలా చక్కగా నడు స్తోందని ఎన్నికల ఆయన వెల్లడించారు. డిసెంబర్‌ 26 నుంచి ఓటరు నమోదు ప్రారంభం అయ్యిందని, మొత్తం ఇప్పటి వరకు 8 లక్షల మంది వరకు కొత్తగా నమోదు అయ్యారని వివరించారు.

కొత్తగా ఓటు నమోదు కోసం మొత్తం 9లక్షల 15వేల అప్లికేషన్లు వచ్చాయని,ఓట్లు డిలీట్‌ అయినవి కూడా మళ్లీ అప్లై  చేయడానికి దరఖాస్తులు ఎక్కువగానే వచ్చాయన్నారు. ఒక్కరే అనేక సార్లు అప్లై చేసిన వారిని డిలీట్‌ చేయడానికి కుదరలేదని, అందుకే వాటిని పరిశీలిస్తున్నామన్నారు. పూర్తిగా పరిశీలించకుండా తీసేస్తే ప్రజాస్వామ్యంలో సరైన పద్దతి కాదు కాబట్టి వాటిని అలాగే ఉంచా మన్నారు.


ఫిబ్రవరి 20న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35లక్షల ఓట్లు తొలగించబడ్డాయని, ప్రతి ఓటరు తమ ఓటు జాబితాలో ఉందో లేదో ఎప్పటి కప్పుడు చెక్‌ చేసు కోవాలన్నారు. ఇప్పటి వరకు 25లక్షల మంది ఎన్‌రోల్‌ చేసుకున్నారన్నారు. 95శాతం మంది అనర్హులను తొలగించామని, 70 నుంచి 80వేల మంది అనర్హులను తొలగించామన్నారు.ఇంకా 7 నుంచి 8లక్షల ఓటర్‌ అప్లికేషన్స్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. ఓట్ల గల్లంతు అయిన వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, రెండు అడ్రెస్సులు పెట్టడం వల్ల వారిని గుర్తించలేక పోయామని చెప్పారు.

మేడ్చల్‌ 7.4లక్షల మంది తొలగించబడ్డారని, ఓట్ల తొలగింపు అనేది ఫిబ్రవరి 22 తర్వాత జరగదన్నారు. ఫామ్‌ 6 ద్వారా 8లక్షల 64వేల 128 కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని, ఫామ్‌ 6ఏ ద్వారా 1123 దరఖాస్తులు,ఫామ్‌ 7కు 10,130 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇప్పటి వరకు టీచర్లు,పట్టభద్రులు చాలా తక్కువ మంది అప్లయి చేసుకున్నారని, పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఈనెల 31 వరకు గడువు ఉందని తెలిపారు. ఒకసారి తుది జాబితా వచ్చిందంటే చేర్చడం నా చేతిలో ఉంటుందిగానీ, తొలగించడం నా చేతిలో ఉండదన్నారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. మీడియాలో అన్ని పార్టీలను సమానంగా చూపించాలన్నారు.

బిఎస్పీ థర్డ్‌ లార్జెస్ట్‌ పార్టీ అని మీడియాలో మా పార్టీ చూపించడం లేదని, వారు నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. ఓటర్‌ స్లిప్‌లో గానీ ఓటరు లిస్ట్‌లో పేరు ఉంటుంది కాబట్టి ఓటు వేయవచ్చునని, ఏదైనా ఐడి ప్రూఫ్‌ తీసుకొని వెళ్లి ఓటు వేయొచ్చన్నారు. బోగస్‌,డుప్లికేట్‌ ఓట్ల తొలగింపు వివరాలు ఇలా ఉన్నాయి.1 జనవరి,2015 నాటికి 28,43,708 ఓట్లు1జనవరి, 2016 నాటికి 26,00, 692 ఓట్లు, 1 జనవరి,2017 నాటికి 26,20,682 ఓట్లు,1జనవరి,2018 నాటికి 25,32,778 ఓట్లు,10 సెప్టెంబర్‌ 2018 నాటికి 26,13,677 ఓట్లు, 19 నవంబర్‌,2018 నాటికి 28,06,587 ఓట్లు తొలగించబడినట్లు పేర్కొన్నారు.

తొలగించిన ఓటర్ల పేరుతో జాబితాలను వెబ్‌సైట్‌లో సైతం పొందుపరిచినట్లు వెల్లడించారు. తొలగించిన ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో ఓటర్లు చూసుకోవాలని ఒకవేళ పేరు తొలగించినట్లు గుర్తిస్తే ఓటరు నమోదు కోసం స్థానిక బిఎల్‌ఓను సంప్రదించాలని రజత్‌కుమార్‌ సూచించారు. 2019 జనవరి 1 అర్హత తేదీగా చేపట్టిన తాజా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

కొత్త ఓటర్ల నమోదు కోసం ఈనెల 20న రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందుకు సహకరించాలని రాజకీయ పార్టీలను కోరినట్లు తెలిపారు. తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరిగే చోట్లలో 23న ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆ రోజు పోలింగ్‌ కేంద్రాల వద్ద బూత్‌ స్థాయి అధికారులు(బిఎల్‌ఓ) ఓటర్ల జాబితాతో అందుబాటులో ఉండి కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తుతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారని చెప్పారు.

===============================================

Leave a Reply

Your email address will not be published.