మార్చి 25 న ‘ఒరేయ్ బుజ్జిగా` చిత్రం విడుదల …

శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న యూత్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా…`యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం. ఉగాది కానుకగా మార్చి 25 విడుదలవుతుంది
ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ – “ మా బేనర్లో ‘ఏమైంది ఈ వేళ’, ‘అధినేత’, ‘బెంగాల్ టైగర్’, ‘పంతం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది, మా ‘ఒరేయ్ బుజ్జిగా…’ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజ్ తరుణ్ కి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది, ఉగాది కానుకగా మార్చి 25 ఈచిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.